భీమ్లా నాయక్ ని ఈ నెల 25న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించినా.. ఎన్నో అనుమానాలు. 25న వస్తుందా, రాదా? అంటూ డౌట్లు. ఎందుకంటే… ఏపీ నుంచి రావాల్సిన క్లియరెన్సులు రాలేదు. 100 శాతం ఆక్యుపెన్సీ పై సందిగ్థం ఉంది. ఇప్పుడు అవన్నీ తీరిపోయాయి. ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని విడుదల చేసుకోవొచ్చని ప్రభుత్వం చెప్పేసింది. దాంతో… భీమ్లా అడ్డంకి తొలగిపోయినట్టైంది. ఈనెల 25న భీమా రావడానికి లైన్ క్లియర్ అయిపోయింది.
100 శాతం ఆక్యుపెన్సీ లేకపోతే… భీమ్లా వచ్చేదికాదు. అందుకే.. ముందుగానే `గని` టీమ్ అలెర్ట్ అయ్యింది. భీమ్లా రాకపోతే.. 25న విడుదల కావడానికి గని సిద్ధపడింది. ఇప్పుడు `గని` తన ప్రయత్నాలు విరమించుకున్నట్టే. మరోవైపు.. `ఆడవాళ్లూ మీకు జోహార్లూ` ఈనెల 25న రావాలి. ఆ సినిమా వెనక్కి వెళ్లే ఛాన్సుంది. ఈ రెండు సినిమాలూ మార్చి 4న రావొచ్చు.
భీమ్లాకి ఇలా లైన్ క్లియర్ అయ్యిందో లేదో, హైదరాబాద్ లో బెనిఫిట్ షోల హంగామా మొదలైపోయింది. ఈనెల 25 తెల్లవారుఝామున హైదరాబాద్ లో ఫ్యాన్స్ షోలు పడబోతున్నాయి. ఇప్పటికైతే… శ్రీరాములు, అర్జున్, భ్రమరాంబ, మల్లికార్జున్ థియేటర్లు బుక్ అయిపోయాయి. ఈ నాలుగు థియేటర్లలో ఉదయం 4 గంటలకే భీమ్లా తొలి షో పడబోతోంది.