ఈగ‌ల్ కు లైన్ క్లియ‌ర్‌

సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకొన్న ఈగ‌ల్ చిత్రానికి సోలో రిలీజ్ డేట్ ఇస్తామ‌ని ఛాంబ‌ర్ త‌ర‌పున దిల్ రాజు మాట ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దానికి త‌గ్గ‌ట్టుగానే ఫిబ్ర‌వ‌రి 9న ఈగ‌ల్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్ణ‌యించింది. అయితే అదే రోజున యాత్ర 2, ఊరి పేరు భైర‌వ కోన‌, లాల్ స‌లామ్ విడుద‌ల‌కు రెడీ అయ్యాయి. యాత్ర 2 ని వాయిదా వేయ‌డం కుద‌ర‌ద‌ని ఆయా నిర్మాత‌లు చెప్పేశారు. లాల్ స‌లామ్ ఓ డ‌బ్బింగ్ సినిమా. దాన్ని ఆప‌డం క‌ష్ట‌మే. ఇప్పుడు మిగిలింది ఊరి పేరు భైవ‌ర‌కోన‌. ఇప్పుడు ఈ చిత్రం వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత రాజేష్ దండా ఒప్పుకొన్నారు. దాంతో ఊరి పేరు భైర‌వ‌కోన‌… ఈగ‌ల్ చిత్రానికి దారి ఇచ్చిన‌ట్టైంది.

యాత్ర 2 రాజ‌కీయ కార‌ణాల దృష్ట్యా విడుద‌ల కాక త‌ప్ప‌డం లేద‌ని, లాల్ స‌లామ్ వ‌చ్చినా త‌మ‌కు ఇబ్బంది లేద‌ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ చెప్పింద‌ని, అందుకే భైవ‌ర కోన నిర్మాత‌ని సినిమా వాయిదా వేసుకోమ‌ని కోరామ‌ని, దానికి నిర్మాత రాజేష్ దండా ఒప్పుకొన్నార‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దీనిపై ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సంక్రాంతి త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల్ని దిల్ రాజు మీడియాకు వివ‌రించారు. ఈగ‌ల్ సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో వాయిదా ప‌డింద‌ని, ఆ చిత్రానికి సోలో రిలీజ్ ఇవ్వాల్సిన బాధ్య‌త చాంబ‌ర్‌పై ఉంద‌ని, అయితే యాత్ర 2 విడుద‌ల ఆప‌లేక‌పోయామ‌ని, లాల్ స‌లామ్ విష‌యంలోనూ అదే జ‌రిగింద‌ని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రికి సీఎం సూచనలివ్వడం కూడా తప్పేనా ?

వైసీపీ మీడియా, సోషల్ మీడియా ఎంత భావదారిద్ర్యంలో ఉందో ... నాదెండ్ల మనోహర్ కు చంద్రబాబు క్లాస్ అంటూ చేస్తున్న ప్రచారంతోనే తేలిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరద సహాయ చర్యలు జోరుగా...

“ఫ్యాన్స్”కు బ్రహ్మాజీ కితకితలు

వైసీపీ ఫ్యాన్స్ అంటే అందరికీ అలుసైపోతున్నారు. ప్రతి ఒక్కరూ టీజ్ చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా బ్రహ్మాజీ కూడా చేరారు. జగన్ రెడ్డి .. వరదల సహాయ చర్యలపై సుదీర్ఘమైన...

రంగంలోకి భార‌త మాస్ట‌ర్ మైండ్… ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెర‌?

దేశంలోని అంత‌ర్గ‌త భ‌ద్ర‌త మాత్ర‌మే విదేశాల‌తో సంబంధాల విష‌యంలో భార‌త మాస్ట‌ర్ మైండ్ అజిత్ దోవ‌ల్. రిటైర్డ్ అధికారి అయినా, భార‌త ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం అత‌న్ని ఇంకా కొన‌సాగిస్తుంది అంటే త‌న...

రవిచంద్రారెడ్డిని గెంటేసిన సాక్షి , వైసీపీ !

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీవీ చానళ్లలో ఆపార్టీ తరపున బూతుల సంప్రదాయాన్ని కొనసాగించిన వ్యక్తి రవిచంద్రారెడ్డి. సాక్షిలో రోజూ ఆయన విపక్షాలపై.. విపక్ష నేతలపై ఆయన వ్యాఖ్యలు అసహ్యం పుట్టించేలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close