టాలీవుడ్లో మన్మధుడిగా అమ్మాయిల మనసు దోచిన యువ సామ్రాట్ నాగార్జున తన కొడుకులకు కూడా అదే ఇమేజ్ తీసుకు రావడంలోనే సక్సెస్ అయ్యాడు. ఏ మాయ చేసావే సినిమాలో లెక్కలేనన్ని లిప్ లాక్ లతో సమంతని ముద్దుల పరవశంలో ముంచిన చైతు సినిమాలో కనీసం ఒక హాట్ లిప్ లాక్ అయినా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం చైతు చేస్తున్న మూవీ సాహసం శ్వాసగా సాగిపో.. గౌతం మీనన్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాలో మంజిమా హీరోయిన్ గా చేస్తుంది.
సమంత ఫీచర్స్ ఉన్నా ఈ అమ్మడు ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అయితే గౌతం సినిమా అంటే మరి లిప్ లాక్ ఉండాల్సిందేగా.. అది కాక హీరో మన చైతు ఇక అగుతారా చెప్పండి. ఈ సినిమాలో కూడా నాగచైతన్య మంజిమాల మధ్య మాంచి ఇంటిమేట్ సీన్లు ఉన్నాయట. తెలుగులో ఎలాగు ఇలా చేసి స్టార్ స్టేటస్ అందుకున్న సమంతని చూసి మంజిమా కూడా అసలు ఏమాత్రం తగ్గట్లేదట.
తండ్రికి తగ్గ తనయుడిగా నవ యువ మన్మధుడిగా నాగచైతన్య కూడా ఇలా రెచ్చిపోవడం చూసి అందరు ఆశ్చర్య పడుతున్నారు. ప్రస్తుతం కెరియర్లో ఫ్లాపుల మీదున్న ఈ హీరో ఈ ముద్దుల సీక్వెన్స్ తో అయినా సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నారు. అసలైతే దీపావళికి రిలీజ్ చేద్దామనుకున్న సాహసం శ్వాసగా సాగిపో, అఖిల్ సినిమా కారణంగా పోస్ట్ పోన్ అయ్యే చాన్సులు ఉన్నాయ్.