మద్యం ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. శనివారం నుంచి 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతబడనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైన్స్ షాపులను క్లోజ్ చేయాలంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
సోమవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం నుంచే మద్యం షాపులతోపాటు బార్లు కూడా బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టే క్రమంలోనే 48గంటలపాటు మద్యం షాపులు మూసివేయాలని పేర్కొంది.
ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఉత్తర్వులు తెలంగాణాలోని అన్ని జిల్లాలకు వర్తించవు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే జిల్లాల్లో మాత్రమే వైన్ షాపులు, బార్లు మూతబడనున్నాయి. మే 25 నుంచి 27 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు క్లోజ్ అవ్వనున్నాయి.