మద్యం రేట్ల రేషనలైజేషన్ పేరుతో కొన్ని బ్రాండ్ల రేట్లను పెంచి.. మరికొన్ని బ్రాండ్ల రేట్లను తగ్గించడం వెనక భారీ గోల్ మాల్ ఉందని స్పష్టమైంది. స్టాక్ క్లియరెన్స్ సేల్ చేసుకునలా.. తమ సొంత బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని బయటకు ఇస్తోంది. ధరలు పెంచామన్నట్లుగా సమాచారం ఇచ్చారు. కానీ ముసుగులో కొన్ని బ్రాండ్ల ధరలు తగ్గించారు. అవి సొంత బ్రాండ్లన్న ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై తీవ్ర ఆరోపణలు రావడంతో మద్యం వ్యాపారాన్ని డీల్ చేస్తున్న వాసుదేవరెడ్డి … ఫ్యాక్ట్ చెక్ తో తెర ముందుకు వచ్చారు. ఆయన చెప్పిందేమిటంటే… స్టాక్ క్లియరెన్స్ కోసం ధరలు తగ్గించడం కాదని…. ఆదాయం ఏకంగా రూ. కోటి పెరిగిందని చెప్పుకొచ్చారు. అంటే మందుబాబుల దగ్గర నుంచి రోజుకు కోటి అదనంగా వసూలు చేస్తున్నారన్నమాట. వాసుదేవరెడ్డి ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయాలు దాచేసి.. కొన్ని మాత్రమే బయటకు చెబుతూ… అడ్డగోలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ… భారీ స్కాం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఏపీలో మద్యం తాగే అలవాటు ఉన్న వారి ఆస్తులు, ఆరోగ్యం తమ సొంతం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అడ్డూఅదుపూ లేని లిక్కర్ బ్రాండ్లను.. నకిలీ మద్యాన్ని అమ్ముతూ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. వేల కోట్లు వెనకేసింది. వేల మంది మందుబాబులు అనారోగ్యానికి గురయ్యారు. వారి ఆస్తులు గుల్ల అయ్యాయి. అయినా వారిని వదిలి పెట్టడం లేదు. పిండుకుంటూనే ఉంది.