ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు మంచి రోజులు వచ్చాయంటే ఇదే. ప్రభుత్వం కాస్తంత ధరలు తగ్గిస్తే తమ బాధ్యతగా మద్యం కంపెనీలు కూడా ధరలు తగ్గించాయి. దాదాపుగా 30 కంపెనీలు క్వార్టర్ కు రూ. 30 వరకూ వరకూ మద్యం ధరలు తగ్గించాయి. ఇది మందుబాబుల్ని సంతోషపెడుతోంది. అంతకు ముందు రెండు వందల యాభై రూపాయల వరకూ ఉండే క్వార్టర్ బాటిల్ ఇప్పుడు కంపెనీని బట్టి వంద నుంచి నూట యాభై లోపే ఉంటోంది.
జగన్ ప్రభుత్వానికి మందు బాబుల తిట్లు మామూలుగా ఉండేవి కావు. మద్యం మానేస్తారని చెప్పి షాక్ కొట్టేలా ధరలు పెంచుతానని దోపిడీ చేసేశారు. మద్యం అలవాటు ఉన్న వాళ్లు మానలేరు.తమ సంపాదనలో అత్యధిక భాగం మద్యం మీద వెచ్చించడంతో పేద, మద్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి.ఇప్పుడు వారు ధరలు తగ్గడంతో తమ ఇంట్లోకి ఇచ్చే సంపాదన కాస్త పెరిగింది. ఇది కుటుంబాలను కూడా సంతోషపెడుతోంది.
గతంలో ఓన్లీ జే బ్రాండ్స్ మాత్రమే అమ్మేవారు . ఇతర కంపెనీల మద్యం చాలా తక్కువగా అమ్మేవారు. అదీ కూడా బార్లలో మాత్రం అత్యధిక రేట్లకు అందుబాటులో ఉండేవి, ఇప్పుడు అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. జే బ్రాండ్స్ మూతపడ్డాయి. అయితే అసలు ఆ స్కాంలో విచారణ ఎక్కడి వరకు వచ్చిందో మాత్రం తెలియడంలేదు.