తెలంగాణలో లిక్కర్ రేట్లను పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కనీసం రూ. వెయ్యి కోట్ల ఆదాయాన్ని పెంచుకోవాలని పెంచాలని ప్రతిపాదనలు రెడీ చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ తరవాత దుకాణాలు తెరిచినప్పుడు కేసీఆర్ సర్కార్ ధరలను దాదాపుగా యాభై శాతం పెంచింది. ఆ తర్వాత మళ్లీ పెంచలేదు. కానీ అప్పట్లో ఏపీలో షాక్ కొట్టే రేట్లు ఉండేవి. దాంతో ఎక్కువ మంది తెలంగాణలోనే కొనుగోలు చేసేవారు. శివారు ప్రాంతాల్లో అయితే మద్యం అమ్మకాలు ఓ రేంజ్ లో ఉండేవి.
కానీ ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మద్యం ధర తగ్గిపోయింది. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఏపీ నుంచి ఎవరు వచ్చినా.. లేదా ఏపీకి ఎవరు వెళ్తున్నా ఫ్రెండ్స్ నుంచికాల్స్ వచ్చేవి. రెండు బాటిల్స్ తీసుకురా అనిఅడిగేవారు. అలాంటి సేల్స్ ఇప్పుడు లేవు. ఎందుకంటే అన్నిరకాల బ్రాండ్లు, తక్కువ ధరలకే ఏపీలో అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు తెలంగాణలో రేట్లు పెంచితే .. ఏపీ కన్నా ఎక్కువ అవుతాయి. అంటే పరిస్థితి రివర్స్ అయినట్లవుతుంది. ఏపీ శివారులోని మద్యం దుకాణాలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ సారి తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చి మద్యం కొనుగోలు చేస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాల అమలు కోసం నిధుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. అన్ని మార్గాలూ అన్వేషిస్తోంది. పెంచేంది కొంత అయితే పర్వాలేదు..భారీగా పెంచితే మాత్రం మందుబాబుల సెగ తగిలే అవకాశం ఉంది