ఆంధ్రప్రదేశ్లో ఉదయం నుంచి మందుబాబు చేస్తున్న హడావుడి.. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద ఉన్న రద్దీ.. ఇన్నాళ్లు పాటించిన భౌతిక దూరం.. లాక్ డౌన్ మొత్తం నిర్వీర్యమైపోయేలా జరిగిన ఘటనలు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని షాక్ కు గురి చేశాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందంటూ.. ఆరా తీశారు. నేరుగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు.. పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వచ్చింది. లాక్ డౌన్ ఒక్క సారిగా ఎత్తేశారా ఏమిటి.. అన్న రీతిలో ప్రశ్నలు సంధించారు. కేంద్రం విధించిన మార్గాదర్శకాలేమిటి.. ఏపీలో అమమలు చేస్తున్న మార్గదర్శకాలేమిటి అని కనుక్కున్నారు. మద్యం దుకాణం వద్ద ఐదుగురు కన్నా ఎక్కువ ఉండవద్దని కేంద్రం స్పష్టం చెప్పింది. ఏపీలో అవేమీ పట్టించుకోలేదు.
ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్లోని మద్యం దుకాణాల వల్ల పరిస్థితే… జాతీయ మీడియాలోనూ మార్మోగింది. ఈ మాత్రం దానికి ఇంత కాలం ప్రజల్ని ఇళ్లలో నిర్బంధించడం ఎందుకన్న మౌలికమైన ప్రశ్న.. అ్ని మీడియాల నుంచి వచ్చింది. అయితే.. దీనికి ఏపీ సర్కార్ వద్ద సమాధానం లేకుండా పోయింది. జిల్లాల వారీగా రెడ్ జోన్లను కేంద్రం ప్రకటిస్తే.. వాటిని మండలాల వారీగా మార్చుకున్న ఏపీ సర్కార్.. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ మద్యం దుకాణాలను ప్రారంభించింది. ఈ పరిస్థితిపై పీఎంవో అధికారులు వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్లో రాను రాను.. కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు అరవై నుంచి ఎనభై కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్య వచ్చిందన్న అభిప్రాయం జాతీయ స్థాయిలో వస్తూండగానే… ఇప్పుడు.. మద్యం షాపులు ఓపెన్ చేశారు. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కరోనా జ్వరం లాంటిదని చెబుతూండటం… అధికారులు ఆ కారణంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నేరుగా పీఎంవో అధికారులు ఆరా తీయడం.. ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది.