లిక్కర్ స్కామ్ అంతా బహిరంగం. దొరికిపోతామని తెలిసి కూడా స్కాములు చేశారు. వారి ధైర్యం ఏమిటి అంటే డ్రామాలు. డ్రామాలకు రాటుదేలిన వైసీపీ ఇప్పుడు అదే డ్రామాల ద్వారా కొంత మందిని బలి ఇచ్చి .. అసలు వాళ్లు బయటపడాలనుకుంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ డ్రామాలో ప్రధాన పాత్ర పోషిస్తూ మరీ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయసాయిరెడ్డి వ్యవహారం సీఐడీ అధికారుల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.
మొత్తం మద్యం స్కెచ్ విజయసాయిరెడ్డిదే !
ప్రభుత్వం ఏర్పడగానే మద్యం వ్యాపారం ఎలా చేయాలి.. మద్యం పాలసీ ఎలా ఉండాలి.. ఎవరెవరు ఎలాంటి కంపెనీల్ని కబ్జా చేసి మద్యం అమ్మాలి.. మద్యం దుకాణాల ద్వారా కాకుండా బెల్టు షాపుల ద్వారా పన్ను చెల్లించని మద్యాన్ని ఎలా అమ్మించాలి.. మొత్తం స్కెచ్ వేసింది.. విజయసాయిరెడ్డి. అలా వచ్చిన డబ్బుల్ని ఎలా రూటింగ్ చేయాలి…ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించాలన్నది స్క్రిప్ట్ చేసింది విజయసాయిరెడ్డి. ఆ విషయం ఆయన మాటల్లోనే స్పష్టమయింది. తొలి సమావేశాలు ఆయన ఇళ్లలోనే జరిగాయని తేలిపోయింది. మొత్తం స్కామ్‌కు స్క్రిప్ట్ రాసిన విజయసాయిరెడ్డిని తర్వాత ఎందుకు పక్కన పెడతారు ?
వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డిలను బకరాలను చేస్తున్నారు !
విజయసాయిరెడ్డి చెప్పిన దాని ప్రకారం.. రాజ్ కసిరెడ్డినే మొత్తం చేశారు. ఓ వ్యక్తి వల్ల అంతా అవుతుందా అన్న ప్రశ్న సహజంగా అందరికీ వస్తుందని విజయసాయిరెడ్డికి తెలుసు. కానీ తన అల్లుడి పేరు మీద ఉన్న కంపెనీలు కూడా రాజ్ కసిరెడ్డివే..ఆయన లీజుకు తీసుకున్నారని చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీల్ని ఆయన అప్పులుగా చూపిస్తున్నారు. అల్లుడి కంపెనీలతో..వ్యాపారాలతో సంబంధం లేదని ఆయన ఇంతకు ముందు ప్రకటించారు కానీ.. నోటి మాటగా ఏకంగా వంద కోట్లు అప్పు అరబిందో నుంచి ఇప్పించానని చెబుతున్నారు. ఇక్కడ ఆయన బకరాలను ముందే రెడీ చేసుకున్నారని అనుకోవచ్చు.
విజయసాయిరెడ్డి ఎంత చేసినా జగన్ ను కాపాడి తాను తప్పించుకోగలడా?
లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ జగన్ రెడ్డి.. మొత్తం అవినీతి సొమ్ములో 90 శాతం ఆయనకే వెళ్తాయి. మిగతా పాత్రధారులు పది శాతం పంచుకుంటారు. ఇది వైసీపీ నేతలు అనుకునే విషయం. కానీ ఇప్పుడు జగన్ కు ఏమీ తెలియదని నమ్మించాడనికి విజయసాయిరెడ్డి..ల ఆయనకు దూరం అయినట్లుగా.. కోటరీ పేరుతో రాజకీయం చేస్తూ…స్కిట్స్ వేస్తున్నారు. ఎంత చేసినా జగన్ ను కాపాడటం.. తాను సుద్దపూసను అని నిరూపించుకోవడం అంత తేలిక కాదు. వి.సా.రెడ్డి గురించి తెలిసిన వారందరికీ ఆయన ఎంత తెలివైన సాక్షినో అర్థమవుతోంది.