లిక్కర్ స్కామ్లో వైసీపీ కీలక బ్యాచ్ బకరాగా వాడుకున్న ఆంధ్రప్రదేస్ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సీఐడీ అధికారులకు చిక్కినట్లుగా తెలుస్తోంది. ఆయన కనిపించడం లేదని వైసీపీ ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆయన చాలా కాలంగా పరారీలో ఉన్నారు. పలు కేసులు ఆయనపై ఉన్నాయి. ఆయన దొరికితే అసలుకే ముప్పు ఇస్తుందన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారేమో కానీ తాజాగా ఆయన కనిపించకపోవడంతో… ఆందోళన పడుతూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.
సీఐడీ అధికారులు వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని.. హైదరాబాద్ శివారులో మూడు రోజుల నుంచి వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు అక్రమంగా నిర్భంధించారని ప్రచారం చేస్తున్నారు. వాసుదేవరెడ్డిని అక్రమంగా నిర్భంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని అంటున్నారు. లిక్కర్ దోపిడీలో గత ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తుల పేర్లు చెప్పాలంటూ వాసుదేవరెడ్డిపై ఒత్తిడి చేసి చిత్రహింసలగు గురిచేసే ప్రమాదం ఉందని పోస్టులు పెడుతున్నారు. వైసీపీ కంగారు చూస్తే.. లిక్కర్ స్కామ్లో ఏదో భారీ అప్ డేట్ రాబోతోందని ఎవరికైనా అర్థమైపోతుంది.
వాసుదేవరెడ్డి అనే వ్యక్తి ఏపీ అధికారి కాదు. రైల్వేలో పని చేసే సిగ్నలింగ్ అధికారి. తెలంగాణకు చెందిన వారు. ఆయనను తీసుకు వచ్చి… ముందు పెట్టి లిక్కర్ కథ అంతా నడిపారు. ఆయనకు ఏమైనా ముట్టిందో లేదో తెలియదు కానీ .. ఆయన చేతుల మీదుగానే అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఈ స్కామ్లో ఆయనే సెంటర్ పాయింట్. ఆయన దొరికితే.. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి వరకూ లిక్కర్ వ్యవహారంలో దోచుకున్న వారంతా బయటకు రావాల్సిందే. అందుకే వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. ఆయన వైసీపీ నేతల సంరక్షణ నుంచి భయపడి పారిపోయారా లేకపోతే.. సీఐడీ అధికారులు అరెస్టు చేశారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.