ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీవెంకటేశ్వరని దివ్యక్షేత్రం ఉన్న తిరుపతిలో మద్యనిషేధం విధించనున్నట్లుగా.. కొద్ది రోజుల కిందట.. టీటీడీ ప్రకటించింది. అంతే.. వెంటనే.. ఆహా.. ఓహో.. అని పొగిడితేశారు. ఆ నిర్ణయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి.. ఆయన తల్చుకుంటే.. చేస్తారని.. ఆయన మాటంటే మాటేనని చెప్పుకొచ్చారు. తీరా రెండు నెలలు గడిచేసరికి సీన్ మారిపోయింది. మళ్లీ టీడీపీనే… తిరుపతి మొత్తం మద్యనిషేధం వద్దంటూ.. కొత్త పాట అందుకుంది. అలిపిరికి వెళ్లే మార్గాల్లో మాత్రం.. మద్యం షాపులు లేకపోతే చాలని.. ఓ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. మొదట తిరుపతికి 10 కిలోమీటర్ల పరిధిలో..మద్యపాన నిషేధం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. చివరికి .. అలిపిరికి వెళ్లే రూట్లకు పరిమితం అయింది.
తిరుపతిలో మద్య, మాంసాలను నిషేధించాలనేది.. చాలా కాలంగా ఉన్న డిమాండ్. రోజుకు.. లక్ష మందికిపైగా భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తూంటారు. వారిలో ఎక్కువ మంది తిరుమలలో శ్రీనివాసుడ్ని మాత్రమే చూసి వెనుదిరగడం లేదు. శ్రీనివాసమంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం.. శ్రీకాళహస్తి వంటి ప్రాంతాలకూ వెళ్తూంటారు. అందుకే.. తిరుపతిలో.. ఎక్కువగా భక్తులే కనిపిస్తూంటారు. వీరి భక్తి ప్రపత్తులను గౌరవించడానికైనా.. సిటీలో మద్య, మాంసాలను నిషేధించాలన్న డిమాండ్ ఉంది. ఇది సాధ్యం కాదని.. గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్నట్లుగా కనిపించింది. చివరికి చేతులెత్తేసింది.
ముందుగానే… తిరుపతిలో మద్య, మాంసాలపై నిషేధం సాధ్యంకాదని.. కానీ నియంత్రణ విధిస్తామని ప్రకటించి ఉన్నట్లయితే.. భక్తులు పెద్దగా ఆశపడేవారు కాదు. కానీ.. ప్రభుత్వం అలా చేయకుండా… ప్రచతారం కోసం అన్నట్లుగా.. మద్యాన్ని నిషేధిస్తామన్నట్లుగా ప్రకటించింది. తీరా.. అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చే సరికి..సాధ్యం కాదన్నట్లుగా చేతులెత్తేసింది. దీంతో.. ప్రభుత్వమే అభాసుపాలయినట్లయింది.