పొరుగు రాష్ట్రాలకు ఏపీ ఎంత కామెడీ అయిపోయిదంటే… తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏపీ బోర్డర్లలో ప్రత్యేకంగా భారీగా మద్యం దుకాణాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో అమ్మే లోకల్ సరుకు డేంజర్ అని అక్కడి ప్రజలు గుర్తిస్తున్నారని.. వాటిని తాగేందుకు ఆసక్తి చూపించడం లేదని.. అందుకే కర్ణాటక ప్రభుత్వ మద్యం అమ్మకాలు చేసే సంస్థలు.. బోర్డర్లలో ప్రత్యేక దుకాణాలు.. మంచి బ్రాండ్లు, సరసమైన ధరలతో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి బోర్డర్లలో మద్యం దుకాణాల ద్వారా భారీ ఆదాయం వస్తోంది. నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, కర్నూలు జిల్లాల బోర్డర్లలో మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఉంటాయి. ఏపీ నుంచి వచ్చి తాగడం లేదా కొనుక్కుని వెళ్లడం చేస్తూంటారు. తెలంగాణలో మద్యం ఆదాయం భారీగా పెరగడానికి ఏపీలోని మద్యం విధానం కూడా ఓ కారణం. ఏపీ ప్రభుత్వ పెద్దలు.. ఏ ఒక్క ఇతర బ్రాండ్లను అమ్మనీయరు . పూర్తి స్థాయిలో .. తమ బినామీ బ్రాండ్లను మాత్రమే ప్రజలకు అంట గడతారు. ఆ బ్రాండ్ల వల్ల వేల మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
ఏపీలో అమ్ముతున్న మద్యం ప్రమాదకరమని.. పలు సంస్థలు రిపోర్టులు ఇచ్చినా.. ప్రభుత్వం సమర్థించుకుంది. అవన్నీ ఫేక్ రిపోర్టులు అని వాదించారు. అయితే.. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులకు మద్యం బాధితులు పెద్ద ఎత్తున వస్తున్నారు. మద్యం తాగి దీర్ఘ కాలిక రోగాలకు గురవుతున్నారు. లివర్ సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.