మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో 12 గంటలపాటు వైన్స్ షాపులు మూసివేయలంటూ ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు.
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మే 11 సాయంత్రం ఐదు గంటల నుంచి మే 13 సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ షాపులు మూసి వేయాలని మొదట ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఆ సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంటే మే 14వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేసి ఉండనున్నాయి.
అయితే, ఈ ఆదేశాలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రమే అమలులో ఉండనున్నాయి. శాంతి భద్రతల దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఎన్నికల ఫలితాల రోజున కూడా వైన్స్ షాపులు కూడా బంద్ కానున్నాయి. ఎవరైనా తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.