ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించబోయే శిలాఫలకం మీద మొత్తం 16మంది పేర్లు చెక్కబడ్డాయి. వాటిలో అన్నిటి కంటే పైవరుసలో ప్రధాని నరేంద్రమోడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పేర్లుంటాయి. ఆ తరువాత వరుసగా గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి. రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ భోసలే పేర్లు ఉంటాయి. వాటి క్రింద కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, దత్తాత్రేయల పేర్లు, అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పేరు, అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న జపాన్ మంత్రి ఇసుకే టకాచీ పేర్లు ఈ శిలాఫలకంపై చెక్కబడ్డాయి.