చైతన్య : బతుకుతూ.. బతికించడమే ఇప్పుడు మతం..!

విశ్వాసం.. మనిషికి అదనపు బలాన్నిస్తుంది. నమ్మకం… మరింత శక్తినిస్తుంది. కానీ ఈ విశ్వాసం.. నమ్మకం.. పరిస్థితుల్ని పట్టించుకోకుండా పరిధులు దాటితే అనర్థమే ఎదురవుతుంది. ఇప్పుడు దేశంలో కరోనా విజృంభణ వెనుక ఉన్నది ఈ నిర్లక్ష్యమే. ఓ మత సమావేశం ఇప్పుడు దేశంలో కరోనాను మరో స్టేజ్‌కి తీసుకెళ్తోంది. ఎందుకు చేస్తున్నామో.. ఎలా చేస్తున్నామో తెలియనంత మూఢ విశ్వాసాలకు జనం వెళ్లిపోతున్నారు. బతుకు… బతికించు అనే సర్వమత సారాన్ని మర్చిపోతున్నారు.

వైరస్ నుంచి కాపాడేది దేవుడని ఎవరూ చెప్పడం లేదు..!

కరోనా వైరస్.. మానవజాతి ఇప్పటి వరకూ చూడనంత మహా విపత్తు. ఇలాంటి సమయంలో.. ఆలోచనతో ఉండటం.. వివేకంతో వ్యవహారించడమే.. ప్రతి మనిషి బాధ్యత. ఓ రకంగా.. ఇది మనుషులు ఎంత బాధ్యతగా.. బుద్దిగా ప్రవర్తిస్తారో.. తేల్చేందుకు ప్రకృతి పెట్టిన పరీక్ష. ఇలా టెస్టులో.. మనిషి ఫెయిలవుతున్నాడు. కంటికి కనిపించని మహమ్మారిని తరిమికొట్టడానికి ఎవరూ ప్రార్థనలు చేయమని చెప్పడం లేదు. పూజలు చేయమని హోమాలు చేయమని చెప్పడం లేదు. అందరూ ఇంటిపట్టున ఉండమని.. కొన్ని నిబంధనలు పాటించమని చెబుతున్నారు. అందరూ.. వాటినే దైవంగా భావించాలని.. పిలుపునిచ్చారు. చివరికి అన్ని రకాల మత పెద్దలు కూడా అదే చెప్పారు. సర్వ మతాల సారం ఒక్కటే. అదే మానవత్వం. దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి పెరిగిపోవడంతో.. విశ్వాసాల పేరుతో.. పీకల మీదకు తెచ్చుకుంటోంది మానవాళి. ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాతే ఘటనే దీనికి నిదర్శనం.

స్వీయనియంత్రణ పాటించి తనతో పాటు అందర్నీ కాపాడటమే ఇప్పుడు దైవత్వం..!

మూఢ విశ్వాసాలు.. అంధ నమ్మకాలతో పీకల మీదకు తెచ్చుకుంటున్నాడు. తబ్లిగి జమాతే కార్యక్రమంలో వైరస్ ప్రబలింది కాబట్టి చెప్పుకుంటున్నాం.. కానీ అలాంటి కార్యక్రమాలు.. ఈ లాక్ డౌన్ సమయంలోనూ… అనేక చోట్ల జరుగుతున్నాయి. పలు చోట్ల ఇళ్లలోనూ.. మరికొన్ని చోట్ల ప్రార్థనా మందిరాల్లోనూ … సమావేశమయ్యారు. సమాచారం తెలిసినంత వరకూ పోలీసులు వారిని చెదరగొట్టారు. కానీ తెలియకుండా జరుగుతున్నవి పెద్ద ఎత్తున ఉన్నాయి. వీరంతా.. తాము పోలీసులకు తెలియకుండా… చూసుకుని గొప్ప పని చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ వారు చేస్తున్నది.. సమాజానికి హాని. తాము దేని కోసం సమావేశం నిర్వహిస్తున్నారో.. సామూహికంగా ప్రార్థనలు చేస్తున్నారో ఆ స్ఫూర్తికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ప్రపంచం అంతా… ఏ పని చేయవద్దని చెబుతుందో అదే చెస్తున్నారు. అలా చేయడం వల్ల దుష్పరిణాలు పెద్ద ఎత్తున ఉంటాయని… ప్రపంచం మొత్తం లాక్ డౌన్ పేరుతో.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూంటే.. అర్థం పర్థం లేని విశ్వాసాలు.. మూఢ నమ్మకాలతో.. ఆ ప్రపంచం కృషిని వీరు నిర్వీర్యం చేస్తున్నారు.

మానవత్వమే అన్ని మతాల సారాంశం..!

సామూహిక సమావేశాల వల్ల ఎంత పెద్ద ముప్పు ఏర్పడిందో.. ఇప్పుడు భారత్ చూస్తోంది. ఓ రకంగా భారత్ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం చూస్తోంది. అనేక దేశాల్లో కరోనా సామాజికవ్యాప్తి .. ఈ సమూహాల కారణంగానే జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది. విశ్వాసం పేరుతో.. దారుణంగా వ్యవహరించడమే ఘోరం అనుకుంటే.. ఒకరిని మించి మరొకరు చేశారంటూ.. ఆరోపణలు చేసుకోవడం.. ఇందులో మరింత అమానవీయం. దైవత్వం ప్రాణాలు నిలపమని ఉపదేశిస్తుంది. ప్రాణాలు తీసుకోమని .. పక్కన వాళ్లు కూడా తుడిచిపెట్టుకుపోయేలా వ్యవహరించాలని …భూమ్మిద ప్రాణకోటి అంతరించిపోయేలా చేయమని ఏ విశ్వాసమూ చెప్పలేదు.. చెప్పదు కూడా. ఏ విశ్వాసం అయినా… బతుకు .. బతికించు అనే సూత్రం మీదే ఆధారపడి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close