టాలీవుడ్లో.. రెగ్యులర్‌గా సినిమాలు తీసే బడా నిర్మాతలు… నిర్మాతల మండలికి సమాంతరంగా… ఓ వేరు కుంపటి పెట్టుకున్నారు. దాని వల్ల చాలా వివాదాలు వచ్చాయి. సినిమా ప్రమోషన్లను కొన్ని చానళ్లకే పరిమితం చేయడం దగ్గర్నుంచి డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో సినిమాను ఎప్పుడు ప్రసారం చేయాలన్న దాని వరకూ.. వారు సొంత నిర్ణయాలు తీసుకుని అమలు చేసుకుంటున్నారు. ఇప్పుడు.. అందర్నీ ఏకం చేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిదేళ్ల తర్వాత నిర్మాతల మండలి ఎన్నికలకు సిద్ధం అవుతోంది. అయితే ఎన్నికలకు ముందే నిర్మాతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేప్రయత్నాలు జరుగుతున్నాయి. విడివిడిగా పోటీకి దిగిన సి. కళ్యాణ్ , ప్రసన్నకుమార్ ప్యానల్స్ కలిసి ఓకే ప్యానల్‌గా పోటీలో నిలిచాయి. కొన్నేళ్లుగా ఎల్ఎల్పీ గిల్డ్ పేరుతో వరుసగా సినిమాలు నిర్మించే నిర్మాతలు వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇప్పుడు వారితోనూచర్చలు జరుపుతున్నారు.
ఎన్నికలు పూర్తయిన తర్వాత అందరూ రాజీనామా చేసి చిత్రపరిశ్రమ పెద్దల సలహాలు, సూచనలతో కౌన్సిల్ కొత్తబాడీని ఎన్నుకుంటామని.. సి.కల్యాణ్ చెబుతున్నారు. ఎల్ఎల్పీ వేరు కుంపటి వల్ల నిర్మాతల మండలికి కొన్ని కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇకపై అన్నీ కౌన్సిల్ ద్వారానే నిర్ణయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు కళ్యాణ్. వేరు కుంపట్ల వల్ల నిర్మాతల మండలి ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో …తెలంగాణ ఫిలిండెవలప్మెంట్ చైర్మన్ రామ్మోహన్రావు, జి ఆదిశేషగిరిరావుతో పాటు కోర్‌కమిటీ సభ్యులు అరవింద్, సురేశ్‌బాబు, కేఎల్ నారాయణ వంటి పెద్దల ప్రయత్నంతో.. నిర్మాతలందరినీ ఏకీకృతం చేసి ముందుకు సాగేలా ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి… టాలీవుడ్లో సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ మందే. కానీ నిర్మాతల మండలిలో మాత్రం.. ఇటీవలి కాలంలో సినిమాలు తీయని చాలా మంది సభ్యులుగా ఉన్నారు. ఈ నిర్మాతల మండలి వల్ల.. వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి సినిమాలు తీస్తున్న తమకు.. ప్రయోజనం లేకపోగా.. లేని పోని సమస్యలు వస్తున్నాయని… బడా నిర్మాతలు భావించారు. అందుకే.. సొంత కుంపటి పెట్టుకున్నారు. మరి ఇప్పుడు.. మళ్లీ.. నిర్మాతల మండలి వారి చేతుల్లోనే పెడతామని చెప్పినా.. ముందుకు వస్తారా.. అన్నది టాలీవుడ్లో ఉన్న సందేహం.