హైదరాబాద్: పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా శుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న లోఫర్ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసిన తర్వాత 19నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 21 వరకు అక్కడే కొనసాగే ఈ భారీ షెడ్యూల్లో అధికశాతం టాకీపార్ట్ పూర్తవుతుంది. శరవేగంగా చిత్రాలను తీసే పూరి, విజయదశమికి చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ లవ్ స్టోరీకి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరుణ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
మరోవైపు వరుణ్ రెండో చిత్రం కంచె గాంధీ జయంతికి అక్టోబర్ 2న విడుదల చేయటానికి నిర్మాతలు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌వారు సన్నాహాలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ కథానాయిక.