ఇరవయ్యో తేదీ నుంచి కేంద్రం ప్రకటించిన సడలింపులు .. తెలంగాణలో అమలు చేయడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత.. ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం చెప్పిందని… కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని నిబంధనలు అమల్లో ఉంటాయని … ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా డిశ్చార్జ్ అయ్యారని.. ఇప్పుడు మర్కజ్ కాంటాక్ట్ కేసులు బయటపడుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం 42 దేశాల్లోసంపూర్ణ లాక్ డౌన్ ఉందని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణలో కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి… తెలంగాణలో మొత్తం 858 పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు. అయితే.. తెలంగాణలో పరిస్థితి ప్రమాదకరంగా లేదన్నారు. దేశంలో 8 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయని … తెలంగాణలో 10 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయన్నారు. వ్యాప్తి రేటు తక్కువగా ఉందన్నారు. మరణాల శాతం దేశంలో 3.22 శాతం ఉంటే తెలంగాణలో 2.44 శాతం ఉందని కేసీఆర్ విశ్లేషించారు. దేశంలో 10 లక్షల మందికి 244 మందిని పరీక్షిస్తే.. తెలంగాణలో 10 లక్షల మందికి 375 మందిని పరీక్షిస్తున్నామన్నారు. ఇప్పటికి 186 మంది డిశ్చార్జ్.. 651 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. చికిత్సపొందుతున్న వారిలోఎవరి పరిస్థితి ఆందోళన కరంగా లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీకి కూడా అనుమతి రద్దు చేశారు.
ప్రజాభిప్రాయాన్ని తాము తెలుసుకున్నామని.. అందరూ ముక్తకంఠంతో లాక్ డౌన్ పొడిగించమనేకోరారని..కేసీఆర్ చెప్పారు. ఇరవయ్యోతేదీ నుంచి కేంద్రం..కొన్నిమినహాయింపులు ఇచ్చింది.ఈ మేరకు ఏపీ సర్కార్ 97 మండలాలు మినహా అన్నిచోట్ల..కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం.. అసలు కరోనాకు ఎలాంటి చాన్స్ ఇవ్వకూడదని డిసైడయింది. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజలకు కాస్త ఉపశమనం ఇవ్వనుంది. మూడు నెలలపాటు ఇళ్ల అద్దెలు అడగకుండా.. ఒత్తిడి చేయకుండా చూడాలని.. అధికారవర్గాలకు సూచించింది.