కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపక్షప్ప కుమారుడు ఇంట్లో లోకాయుక్త పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఆరు కోట్లకుపైగా నగదు దొరికింది. అన్నీ ఐదు వందల రూపాయల నోట్ల కట్టలే. గుట్టలుగా అలా పేర్చిన నోట్ల కట్టలు కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న విరూపాక్షప్ప కుమారుడు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆ అర్వాత అతని ఇళ్లల్లో సోదాలు చేయడంతో ఈ నగదు బయటపడింది.
కర్ణాటకలో లోకాయుక్తకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఈ కారణంగా ప్రతీ సారి అధికార పార్టీ వారి అవినీతి ఈ లోకాయుక్తల వల్ల బయటపడుతోంది. లోకాయుక్త ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలనైనా తీసుకోగలదు. లోకాయుక్త స్వతంత్రంగా పని చేస్తుందని. ఈ సంస్థ విచారణలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అయితే బీజేపీలో ఉన్న అంతర్గత విబేధాల వల్లనే ఈ లంచం వ్యవహారం బయటకు వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై ఫార్టీ పర్సంట్ ప్రభుత్వం అనే ఆరోపణ ఉంది.
విరూపాక్షప్ప తరపునే ఆయన కుమారుడు లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యే విరూపాక్షప్ప ప్రమేయం కూడా ఉందా అన్నదానిపై కూడా విచారణ జరుపుతున్నామని లోకాయుక్త ప్రకటించారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ ఇష్యూలోనూ లోకాయుక్తనే చర్యలు తీసుకుంది. ఓ రకంగా ఏసీబీలాగా లోకాయుక్త పని చేస్తు ఉంటుంది. ఎవరు చర్యలు తీసుకున్నా బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో ఇలా నోట్ల కట్టలు బయటపడటం ఇలా సంచలనాత్మకం అయింది.