మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా లోకేష్ మాటలకు మీడియాలో చాలా చాలా ప్రాధాన్యమే దక్కుతుంది. ఎక్కువ శాతం ఎటకారమే కనిపిస్తున్నప్పటికీ ఏదైనా పబ్లిసిటీ పబ్లిసిటీనే కదా. ఎన్టీఆర్‌ని పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ తాజాగా ఓ డైలాగ్ పేల్చాడు లోకేష్. అంతటితో ఆగకుండా పార్ట్ టైం పొలిటిషియన్స్‌కి స్థానం లేదు అని అన్నాడు. పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ తనను కొంత మంది విమర్శిస్తున్నారని పవన్ మాట్లాడిన మాటలు లోకేష్ డైలాగ్స్‌కి కౌంటర్‌లాగా కూడా కనిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు సంపాదించి కోట్లు ఆదాయం వచ్చేలా చేసుకుంటున్నారని పవన్ అన్న మాటలు జగన్‌కి లోకేష్‌కి కూడా వర్తిస్తాయి. లోకేష్ కూడా హెరిటేజ్‌తో ఓ స్థాయిలో సంపాదించాడు మరి. ఆ విషయం కూడా లోకేషే చెప్పుకుంటూ ఉంటాడు. పార్ట్ టైం పొలిటీషియన్స్ అంటూ తను చేసిన కామెంట్స్‌కి పవన్ ఇచ్చిన కౌంటర్‌పై లోకేష్ కూడా ఏమైనా స్పందిస్తాడేమే చూడాలి.
పవన్ విషయం అలా ఉంటే పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ లోకేష్ దెప్పిపొడిచింది అసలుకైతే ఎన్టీఆర్‌ని. ఈ విషయంలో ఎన్టీఆర్ ఇంతవరకూ స్పందించింది లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం లోకేష్‌పైనే కౌంటర్స్ పడుతున్నాయి. 2009లో చంద్రబాబుకు అవసరమై ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి దించాడని, ఆ తర్వాత ఎన్టీఆర్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని ఎన్టీఆర్ ముందు లోకేష్ నిలవలేడన్న ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్‌ని పార్టీకి దూరం చేశాడన్నది వాస్తవం. అలాంటిది ఆ విషయాలేం తెలియదన్నట్టుగా ఇప్పుడు లోకేష్ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ ఎన్టీఆర్‌ని విమర్శించడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎన్టీఆర్ అయితే ఇప్పటి వరకూ స్పందించలేదు కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం లోకేష్‌ని ఓ స్థాయిలో విమర్శిస్తున్నారు. అన్నింటికీ మించి లోకేష్ దృష్టిలో నందమూరి బాలకృష్ణ పార్ట్ టైం పొలిటీషియన్ అవుతాడో కాదో చెప్పాలని కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. మరి పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ గురించి లోకేష్ ఏం చెప్తాడో చూడాలి. అయినా సొంత పార్టీలోనే మురళీ మోహన్, సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు, బాలకృష్ణ…..ఇలా ఎందరో పార్ట్ టైం పొలిటీషియన్స్ కం బిజినెస్ పీపుల్ని పక్కన పెట్టుకుని పార్ట్ టైం పొలిటిషియన్స్ అంటూ ఇంకెవరినో విమర్శించే అర్హత అసలు లోకేష్‌కి ఉందా?