ఐదేళ్ల వైసీపీ హయాంలో టీడీపీతో పాటు చంద్రబాబు కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు కుటుంబంపై అత్యంత నీచంగా మాటల దాడి చేశారు. సమయం కోసం ఆగ్రహాన్ని అణిచి పెట్టుకున్న లోకేష్ సందర్భం వచ్చినప్పుడు ఆ కోపాన్ని బయట పెట్టకుండా ఉండలేకపోతున్నారు.
తాజాగా శాసనమండలిలో ఈ అంశాన్ని వైసీపీ నేతలు ప్రస్తావించారు. ఆ తర్వాత వారు లోకేష్ ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. అసెంబ్లీకి రాకుండా జగన్ తో పాటు ఎమ్మెల్యేలు పారిపోయారని మంత్రి డోలా విమర్శించారు. ఆ సమంయలో గతంలో చంద్రబాబు కూడా రాలేదని టాపిక్ ను జనరలైజ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు రెండేళ్లు అసెంబ్లీకి వచ్చి పోరాడారని.. తన తల్లిని కంచ పరిస్తే ఆయన బాధపడి వెళ్లిపోయారన్నారు. అయినా ఎమ్మెల్యేలు వచ్చారని గుర్తు చేశారు. ఈ సమయంలో జగన్ కుటుంబంపై కూడా అన్నారని కొంత మంది వైసీపీ సభ్యులు అరిచారు. వారికి లోకేష్ గట్టిగా రిప్లయ్ అయ్యారు. తాము జగన్ కుటుంబాన్ని ఒక్క మాట కూడా అనలేదన స్పష్టం చేశారు. లోకేష్ ఆవేశాన్ని చూసి వైసీపీ సభ్యులు చర్చను పొడిగించలేదు. నారా భువనేశ్వరిని కించ పరిచిన వారిని తాము ప్రోత్సహించబోమని బొత్స చెప్పుకొచ్చారు.
తన తల్లిని కించ పరిచిన ఎవర్నీ వదిలే ప్రశ్నే ఉండదన్న సంకేతాలను నారా లోకేష్ తన ఆగ్రహం ద్వారా పంపించారని అనుకోవచ్చు. రాజకీయాలకు సంబంధం లేని తన తల్లిని నిండు అసెంబ్లీలో కించ పరిచిన వారు ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు. కానీ వారిని వదిలి పెట్టే అవకాశాల్లేవని మాత్రం అనుకోవచ్చు.