ఎన్నికల హింస పెరిగిపోతూండటంతో..కార్యకర్తలను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. బెదిరిపోకుండా.. ధైర్యం ఇచ్చేందుకు…రంగంలోకి దిగింది. ఇంత కాలం అండగా ఉంటామని ప్రకటనలు చేశారు.. ఇప్పుడు నేరుగా కార్యచరణలోకి దిగుతున్నారు. చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తూండగా.. ప్రధాన కార్యదర్శి లోకేష్.. మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన ఓ టోల్ ఫ్రీ నెంబర్ను ప్రకటించారు. వేధింపులకు గురవుతున్నా.. వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నా.. తక్షణం సమాచారం ఇస్తే..సాయం చేస్తామని… ప్రకటించారు. టోల్ ఫ్రీ నెంబర్ 7306299999గా ప్రకటించారు.
ఇరవై నాలుగు గంటలూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ పని చేస్తుందని ప్రకటించారు. వైసీపీ దాడులు, బెదిరింపులను వెంటనే తెలియజేయాలని కార్యకర్తలను లోకేష్ కోరారు. దాడులు మాత్రమే కాదు.. సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా భరోసా ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలను ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో… కేసులు పెట్టి వేధించినా వెంటనే సమాచారం ఇవ్వాలని.. సూచించారు. న్యాయపరంగా ఎదుర్కొందామని.. సూచించారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టినా.. సంయమనం పాటిద్దామని-న్యాయపరంగా ఎదుర్కొందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
40రోజుల్లో వంద చోట్ల పైగా దాడులు, దౌర్జన్యాలు చేయడం గర్హనీయమని .. ఆరుగురిని అత్యంత దారుణంగా చంపేయడం కిరాతకమని లోకేష్ విమర్శిస్తున్నారు. టీడీపీలో మొదటి నుంచి కార్యకర్తల సంక్షేమాన్ని.. లోకేష్ చూసుకుంటున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి.. బీమా చేయించాలనే ఆలోచన చేసింది కూడా లోకేషే. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమాన్ని ఆయనే చూసుకంటారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలోకి వచ్ిచన తర్వాత ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు.