ఏపీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించబోతున్నారు. ఈ టూర్‌కు ఇంచార్జ్‌గా నారా లోకేష్ వ్యవహరించబోతున్నారు. ఎనిమిదో తేదీన ప్రధాని మోదీ పర్యటన ఖరారయింది. ఈ సందర్భంగా విశాఖలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. మోదీ సభ సక్సెస్ కోసం లోకేష్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదివారం విశాఖకు వెళ్లనున్న మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. అధికారులు, స్థానిక నేతలతో విస్తృతంగా మంతనాలు జరుపుతారు.
ప్రధాని మోదీ పర్యటన, బహిరంగసభకు జన సమీకరణపై ఆదివారం మధ్యాహ్నం ఉత్తరాంధ్ర కూటమి నేతలతో సమావేశమై వ్యూహం ఖరారు చేస్తారు. మోదీ పర్యటన ఏర్పాట్లను లోకేష్ చూడాలని సభ భారీ సక్సెస్ అయ్యేలా చూడాలని పై స్థాయి నుంచి వచ్చిన సంకేతాల మేరకే లోకేష్ కు అప్పగించినటన్లుగా తెలుస్తోంది. ప్రధాన మంత్రి నారా లోకేష్, మోదీ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనతో ఢిల్లీలో సమావేశమైనప్పుడు, తర్వాత ఇతర సందర్భాల్లోనూ కలిసినప్పుడు లోకేష్, మోదీ చాలా సేపు మాట్లాడుకుంటూ కనిపించిన సందర్భాలు ఉన్నాయి.
లోకేష్ మేనేజింగ్ స్కిల్స్ పైనా పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికమైన చర్చలు జరుగుతూంటాయి. జన సమీకరణ, సభలను సక్సెస్ చేయడానికి లోకేష్ అనుసరించే వ్యూహం భిన్నంగా ఉంటుందని చెబుతారు. ప్రధాని పర్యటన బాధ్యతలను లోకేష్ తీసుకోవడంతో టూర్ అంచనాలకు అందని విధంగా సక్సెస్ అవుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు.