టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వంద కిలోమీటర్లు దాటింది.. ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకోవడానికి ఆయన ప్రారంభింంచిన పాదయాత్ర భారీ జన సందోహం మధ్య సాగుతోంది. మాట్లాడకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నా ఆయన మాత్రం దూకుడుగానే ఉన్నారు. ఎక్కడ సందర్భం వచ్చినా బాధితులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. తనలో ఉన్న విజన్ నూ సందర్భాన్ని బట్టి ఆవిష్కరించారు.
ఓ సమావేశంలో నాలుగేళ్లు ఇంజినీరింగ్ చేసినా … మూడు నెలల అమీర్ పేట కోర్సు కోసం స్టూడెంట్స్ పరుగెడుతున్నారు. ఎందుకిలా ? ఆ అమీర్ పేట కోర్సులు కాలేజీల్లో ఎందుకు నేర్పకూడదు ? . తాము వస్తే అదే పని చేస్తామని ప్రకటించారు. అంటే లోకేష్ కు ఆ క్లారిటీ ఉంది. టీడీపీ రాగానే చేసి చూపిస్తానన్నారు. ఈ మాటలు విన్న తర్వాత భవిష్యత్ కోరుకునే యువత లోకేష్‌లో ఉన్న విజన్‌ను అభినందించకుండా ఉంటుందా ? ఓ స్కూల్ పిట్టగోడ నుంచి పిల్లలతో మాట్లాడుతూ… టీచర్లను ఎలా గౌరవించాలో చెప్పడం చూసిన వారికి… చదువు, .సంస్కారం నేర్పే రాజకీయనాయుకడ్ని చూశామని అనిపిస్తుంది. పార్టీ అంటే ప్రాణం ఇచ్చే సీనియర్ కార్యకర్త పాదాలకు నమస్కరించి… పార్టీ నీది నాది కాదు.. అందరిదీ అని అనిపించగలిగారు.
వందో కిలోమీటర్ పూర్తయిన తర్వాత గుర్తుగా శిలాఫలకం వేసుకోవడం ఇప్పటి వరకూ చూశాం. కానీ సొంత డబ్బుతో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం శిలాఫలకం వేయడం అందరిలోనూ లోకేష్ ఆలోచనా శైలిపై కొత్త ఆలోచనలు రేకెత్తించేలా చేసింది. అదే సమయంమలో ప్రభుత్వంపై పంచ్‌లకు లెక్కలేదు. పెంచుకుంటూ పోతానన్నాడక్కా.. మనమే అర్థం చేసుకోలేకపోయామని… జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టినా… పథకాల పేరుతో చేస్తున్న మోసాలని పవర్ ఫుల్‌గా ప్రజల ముందు పెట్టినా…. రాజకీయ విమర్శలకు .. ఎక్కడా గీత దాటకుండా రిప్లయ్ ఇచ్చిన అది లోకేష్ స్టైల్ అని ప్రజల్లో వందల రోజుల ముద్ర పడింది
లోకేష్ అంటే… వైసీపీ సోషల్ మీడియా వందల కోట్లు ఖర్చు చేసి.. మార్ఫింగ్‌లు చేసి చేసిన ఫేక్ ప్రచారంలో ఉన్న లోకేష్ కాదని..అసలైన లోకేష్ వేరు అని యువనేత ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. ఇప్పటికి ముగిసింది వంద కిలోమీటర్లే.. అంటే ట్రైలరే అనుకోవచ్చు.