ఒక్కడు పాదయాత్ర చేస్తున్నాడని తెలియగానే .. కాళ్ల కింద స్టూళ్లు లాగడం దగ్గర్నుంచి.. వందల మందిని పెట్టి తప్పుడు ప్రచారం చేయడం వరకూ అన్ని రకాల టాస్కుల్ని పెట్టి.. గురి పెట్టినా… ఆ ఒక్కడు నిర్భయంగా ముందుకు సాగుతున్న యాత్రే యువగళం. కుప్పంలో పడిన మొదటి అడుగు దగ్గర నుంచి ఇప్పటికి రెండు వేల కిలోమీటర్లకు చేరింది. కానీ మొదటి రోజు ఎంత ఉత్సాహం ఉందో.. రెండు వేల కిలోమీటర్ నడక ప్రారంభమైన రోజు ఉత్సాహం ఉంది. ముఖంలో అలసట కూడా లేదు. లక్ష్యం సాధించాలన్న పట్టుదల తప్ప.
ఎన్నో సూటిపోటి మాటలు అన్నారు.. బూతులు తిట్టారు.. పోలీసుల్ని యాత్రపైకి పంపారు.. మాట్లాడకుండా మైకులు లాక్కున్నారు.. స్టూల్ మీద నిలబడి మాట్లాడితే స్టూల్ నూ లాక్కున్నారు.. కొన్ని చోట్ల కోడిగుడ్లు వేశారు.. ఇలా ఎన్ని చేసినా.. లోకేష్ మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. చెప్పాల్సిన వారికి .. ఇవ్వాల్సిన వారికి గట్టిగా ఇచ్చుకుంటూనే ముందుకు సాగుతున్నారు. ఆయన మాట్లాడలేరంటూ చేసిన ప్రచారాల్ని పటా పంచలు చేసి.. సన్నితమైన వ్యక్తని.. పట్టుమని వంద కిలోమీటర్లు నడవలేరన్న వారి ఆశల్ని తంచేస్తూ… తనేంటో ప్రజల ముందు ఉంచుతున్నారు.
గతంలో పాదయాత్ర చేసిన వాళ్లు..గురువారం ఉదయం ఆపేసి..మళ్లీ ఆదివారం సాయంత్రం ప్రారంభిచేవాళ్లు.. లేదా సోమవారం ఉదయం.. కనపించేవాళ్లు. ఇక కాళ్లకు బొబ్బలని.. జ్వరమని.. కోడికత్తి దాడి అని ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారో లెక్కలేదు. కానీ లోకేష్.. సెలవనేది లేదు.. అవిశ్రాంతంగా నడుస్తున్నారు. అదే వారికి..లోకేష్ కు .. తేడా చూపిస్తోంది. ఇప్పటికే సగం పాదయాత్ర ముగిసింది. మరో రెండు వేల కిలోమీటర్లు ఉంది. అవి కాకుండా ఇంకో రెండు వేల కిలోమీటర్లు అయినా సులువుగా పాదయాత్ర చేయగలరు. ఆ స్పిరిట్ లోకేష్ లో కనిపిస్తోంది. లక్ష్యం సాధించాలన్న పట్టదల ఉంది.. దాన్ని అందుకుంటాననే నమ్మకం ఉంది. అదే యువగళానికి అసలైన శక్తి.