నారా లోకేష్‌ను పప్పు అని నిన్నటి వరకూ అన్న నోటితోనే వైసీపీ నేతలు రౌడీ అంటున్నారు. ఈ పిలుపు వైసీపీ నేతలకు కాస్త కొత్తగానే ఉంటోంది. ఎందుకంటే లోకేష్ మాటలు అలా ఉంటున్నాయి. అసువుగా తిట్టేస్తున్నారు. వైసీపీ నేతల స్థాయికి తగ్గట్లుగా తిట్లు లాంటి వ్యవహారిక పదాలను అదుకుంటున్నారు. దీంతో వైసీపీ నేతలకు కోపం వస్తోంది. ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నారని… స్టాన్‌ఫర్డ్‌లో డిగ్రీ చదువుకున్నారా అనే డౌట్ వస్తోందని విజయసాయిరెడ్డి వంటి నేతలు చెబుతున్నారు.
నిజానికి విజయసాయిరెడ్డి ” టక్ జగదీష్” ఆహార్యం చూసి చాలా మంది పెద్ద మనిషి అనుకుంటారు. ఆయన లాంగ్వేజ్ చూసి గతంలో ఇతను సీఏగా చదువుకున్నాడా అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు లోకేష్‌ను చూసి అలా అంటున్నారు. అదే సమయంలో లోకేష్‌ను పప్పు అని.. ఆయన మగతనం గురించి పదే పదే మాట్లాడే ఎమ్మెల్యే రోజా రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నిజానికి లోకేష్ ఎంత పెద్ద మాటలు మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే వైసీపీ నేతలు లోకేష్‌పై వాడిన భాషలో పదిశాతం కూడా వాడలేదు. అనంతపురంలో జగనన్న కాదు… జగన్ దున్న అని విమర్శించారు.
కుప్పంలో “కొడుకులు… ఏం పీకలేడు..”వంటి పదాలతో ఘాటుగానే విమర్శించారు. ఇక ట్విట్టర్లో అయితే లోకేష్ చేసే విమర్శలు ఘాటుగానే ఉంటాయి. జగన్‌ను వసూల్ రెడ్డి, సైకోరెడ్డి అని రకరకాల పేర్లతో విమర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ వైసీపీ నేతలకు ఎక్కడో తగులుతున్నాయి. అందుకే లోకేష్ భాషపై గింజుకుటున్నారు. అయితే ఇప్పటి వరకూ టీడీపీ నేతలు, లోకేష్‌పై చేసిన విమర్శలతో పోలిస్తే .. లోకేష్ చేస్తున్నది తక్కువేనని.. ముందు ముందు ఇంకా చాలా ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.