నారా లోకేష్ ఏపీ యుువతకు మరో కొత్త స్కిల్ డెవలప్మెంట్ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలి కాలంలో సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. గ్రీన్ ఎనర్జీగా పిలిచే ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. కానీఈ రంగంలో ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ ఉన్న వారు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్న సుజ్లాన్‌తో పాటు స్వనితి సంస్థలతో గ్రీన్ స్కిల్ డెలవప్మెంట్ ఒప్పందాలు చేసుకున్నారు.
ఐదేళ్లలో ఏపీ యువతకు ఇరవై లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో గ్రీన్ ఎనర్జీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రంగం నుండి మొత్తం ఏడున్నర లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పునరుత్పాదక ఇంధన రంగానికి ఉన్న ఆదరణ దృష్ట్యా ఏపీ గ్రీన్ టాలెంట్ కు హబ్ గా మార్చాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలోకి ఏపీలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అదానీ, రిలయన్స్ వంటి సంస్థలు వేల కోట్ట పెట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రంగాల్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఏర్పడనుంది. విశాఖలో టీసీఎస్‌తో పాటు గూగుల్ కూడా తమ క్యాంపస్ లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విజయవాడలోని హెచ్‌సీఎల్ క్యాంపస్ ను మరింతగా విస్తరించాలని నిర్ణయించుకున్నారు. తయారీ రంగ పరిశ్రమలు పెద్ద ఎత్తున రాయలసీమకు తీసుకువచ్చేందుకు లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేశారు.