తెలుగుదేశం యువ నేత లోకేష్ పాదయాత్రకు ముహుర్తం ఖారారు చేసుకున్నారు. కొంత కాలంగా ఆయన పాదయాత్ర చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతి ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం కామన్‌గా మారింది. గతంలో అయితే చంద్రబాబుతో పాటు జగన్ జైలులో ఉండటం వల్ల… షర్మిల పాదయాత్ర చేశారు. కానీ షర్మిల పాదయాత్ర వైసీపీకి విజయం లభించలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి ఉన్నందున వారానికి ఆరు రోజుల పాదయాత్రే చేశారు. అయినప్పటికీ ఆయన ఘన విజయం సాధించారు.
ఈ సారి చంద్రబాబు తనయుడు లోకేష్ ఒక్కరే ఏపీలో పాదయాత్ర చేయనున్నారు. కుప్పం నుంచి .. ఇచ్చాపురం వరకూ ఆరేడు నెలల్లో పాదయాత్ర పూర్తి చేసే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా యాత్ర చే్యాలనుకుంటున్నారు. కానీ ఆయన చేయాలనుకుంటున్నది.. పాదయాత్ర కాదు.. బస్సు యాత్ర. ఇందు కోసం బస్సు సిద్ధమయింది.. లోకేష్ పాదయాత్రకు కాస్త అటూ ఇటూగా పవన్ బస్స ుయాత్ర కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.