“ఎంతో నమ్మకంతో సమస్య చెప్పుకునేందుకు వచ్చే ప్రజలపై అంతే ఆదరణ చూపించడమే కాదు ఆ సమస్యను పరిష్కారం చేసి చూపించడమే నిజమైన నాయకుడి లక్షణం” . నారా లోకేష్ ఈ క్వాలిటీని వందకు వంద శాతం సాధిస్తున్నారు. ఒక్క మంగళగిరి ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదర్భార్‌లో సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవడమే కాదు ఆ సమస్యలకు ఓ టైమ్‌లోపు పరిష్కారం చూపించి అభిమానం పెంచుకుంటున్నారు.
సమస్య ఏదైనా మంగళగిరి ప్రజలకు గుర్తొచ్చే పేరు లోకేష్
ఎన్నికల్లో విజయం తర్వాత నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ప్రత్యేకంగా ప్రజాదర్భార్ ను నిర్వహించడం ప్రారంభించారు. పెద్ద, చిన్న సమస్య ఏదైనా ప్రజలు దర్బార్‌కు తరలి వచ్చి సమస్యను విన్నవించుకోవడం ప్రారంభించారు. తమ భూమి సమస్య అయినా.. సర్టిఫికెట్లో పేర్లు తప్పు పడినా.. మరో వ్యక్తిగత సమస్య అయినా లోకేష్‌కు చెప్పుకునేందుకు బారులు తీరేవారు. ఇలా ఇప్పటి వరకూ యాభై రోజుల పాటు ప్రజాదర్భార్ నిర్వహించారు. లోకేష్ ప్రజాదర్భార్ ఉందని సమాచారం వచ్చినప్పుడల్లా కష్టాలు చెప్పుకోవడానికి తరలి వచ్చారు. దీనికి కారణం పరిష్కారం అవుతుందన్న నమ్మకమే.
కష్టాలు తీర్చి భరోసా పెంచిన లోకేష్
యాభై రోజుల పాటు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో 5800కుపైగా సమస్యల పరిష్కారం కోసం అర్జీలు వచ్చాయి. లోకేష్ వాటన్నింటినీ స్వయంగా మానిటర్ చేస్తారు. సంబంధిత విభాగాలకు పంపుతారు. తన టీమ్ తో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తారు. దీని వల్ల నాలుగువేల మంది సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఓ మహిళ ప్రభుత్వం తనకు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్ ను ఇతరులు ఆక్రమించుకున్నారని న్యాయం చేయాలని కోరారు. వెంటనే ఆ సమస్యకు లోకేష్ పరిష్కారం చూపాఱు. ఓ విద్యార్థికి సర్టిఫికెట్లో తప్పుగా పేరు పడిన సమస్య దగ్గర నుంచి ఎవరైనా వ్యక్తిగత సమస్యలతో కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి వ్యక్తిగతంగా కూడా మేలు చేశారు. లోకేష్ స్పందన ఇంత ఆప్యాయంగా .. వేగంగా ఉంటుందని తెలియడంతో ప్రజాదర్బార్‌కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది.
పరదాలు ఉండవు – అడ్డుగోడలుండవు !
నారా లోకేష్ కు సమస్యలు చెప్పుకోవాలని వచ్చే వారికి ఎలాంటి ఆటంకాలు ఉండడవు. ఎలాంటి బారికేడ్లు, పరదాలు లేవు. ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయనే హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారు. ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న ప్రజలను ఉదయం 8 గంటలకు స్వయంగా కలుసుకుని.. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు. జిల్లాల పర్యటనలోనూ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో చేసే విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం
సోషల్ మీడియాలో వివిధ వర్గాల ప్రజలు సాయం కోసం చేసే విజ్ఞప్తులను లోకేష్ ఎప్పటికప్పుడు తన టీమ్ కు పంపి ఫాలో అప్ చేయిస్తున్నారు. ఎంతో మంది తమ సమస్య పరిష్కారం అయినట్లుగా కృతజ్ఞతలు చెబుతున్నారు. నారా లోకష్ లాంటి విజన్ ఉన్న యువనేత .. ప్రజా సమస్యల కోసం చిత్తశుద్ధితో పని చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆయన చేసి చూపిస్తున్నారు.