అమరావతిని విధ్వంసం చేయడానికి పేదల్ని పావులుగా వాడుకున్న జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని పేదలు తొందరగానే గుర్తిస్తున్నారు. ఇప్పుడా పేదలందరికీ వివాదాల్లేకుండా ఇళ్లు కట్టిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. పాదయాత్ర ఓ మైలు అందుకున్నప్పుడల్లా తాను చేయబోయే పనులను శిలాఫలకం మీద రాయించి ఆవిష్కరిస్తున్నారు. మంగళగిరికి చేరుకునే సరికి లోకేష్ పాదయాత్ర రెండున్నర వేల కిలోమీటర్లు అయింది. ఈ సందర్భంగా మంగళగిరిలో ఇరవై వేల పేద కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తానని శిలాఫలకం ఆవిష్కరించారు.
మంగళగిరిలో పేదలను వైసీపీ ప్రభుత్వం ఓ ఆటాడుకుంది. జగన్ రెడ్డి ఇంటి ముందు పేదల కాలనీ ఉండేది. మొత్తం తొలగించేసి కొన్ని వందల కుటుంబాలను రోడ్డున పడేశారు. వారెవరికీ కనీసం ఇళ్లు కూడా ఇవ్వలేదు. సెంటు స్థలాలు చూపించి బయటకు పంపేశారు. వారంతా ఇబ్బంది పడుతున్నారు. ఇక మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడనికి ప్రధాన కారణం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన తప్పుడు ప్రచారం. అమరావతి పేరుతో పేదల ఇళ్లు తొలగిస్తారని.. స్థలాలు లాగేసుకుంటారని చేసిన ప్రచారంతో ఎక్కువ మంది లోకేష్ కు వ్యతిరేకంగా ఓట్లేశారు.
వాటన్నింటినీ లోకేష్ పటాపంచలు చేస్తున్నారు. చాలా వరకూ అలాంటి పేదల ఇళ్లను వైసీపీ ప్రభుత్వమే కూల్చేసింది. తాను పేదల్ని రాజకీయం కోసం వాడుకోనని.. వారికి ఓ గూడు కల్పిస్తానని.. లోకేష్ హామీ ఇచ్చారు. అది నోటి మాటగా ఇచ్చింది కాకుండా. .. శిలాఫలకం ద్వారా అధికారంలోకి వచ్చాక., మర్చిపోకుండా.. మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉండేలా ఉంటుంది.