అప్పుడే పుట్టిన ఓ బిడ్డకు వైద్య సాయం కోసం పది లక్షలు కావాలని మహిళా కమిషన్ సభ్యురాలుగా గెడ్డం ఉమ నారా లోకేష్ ను ట్విట్టర్ ద్వారా అర్థించారు. నారా లోకష్ కూడా వెంటనే స్పందించి సాయం చేశారు. దాంతో ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇప్పుడీ అంశం టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో రకరకాల చర్చలకు కారణం అవుతోంది. ఎందుకంటే ఈ గెడ్డం ఉమ వైసీపీ తరపున టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేష్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు కూడా.
ప్రత్యేకహోదా ఉద్యమం పేరుతో సోషల్ మీడియా ప్రచారంతో గడ్డం ఉమ వెలుగులోకి వచ్చారు. విజయసాయిరెడ్డి ఆశీస్సులతో ఆమె లైమ్ లైట్ లోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏకంగా సింహాచలం అలయ బోర్డు సభ్యురాలిగా నియమించేశారు. నిజానికి ఆమెకు ఆ సభ్యత్వానికి తగ్గ వయసు లేదు. దాన్ని విజయసాయిరెడ్డి పట్టించుకోలేదు. పదవి చేపట్టలేకపోయారు. తర్వాత మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవి ఇచ్చారు. మహిళా కమిషన్ చైర్మన్ పదవి కాలం పూర్తయింది. కానీ సభ్యుల పదవి కాలంపై స్పష్టత లేదు.
ఈ గడ్డం ఉమ.. ఆ చిన్న పిల్లవాడి కష్టం చూసి మానవతాదృక్పథంతో అడిగి ఉంటారు. నారా లోకేష్ పార్టీలు గట్రా చూడకుండా చిన్నరి ప్రాణం నిలపడానికి సాయం చేశారు. అయితే ఈ గడ్డం ఉమ జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని సార్లు ఇలా ఇతరులకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని అడిగారు.. ఎంత సాయం ఇప్పించారన్న ప్రశ్నలు టీడీపీ వర్గాల నుంచి వస్తున్నాయి. పార్టీలకు అతీతంగా సాయం చేస్తున్న నారా లోకేష్ మంచి మనిషి అని వైసీపీ క్యాడర్ బయటకు చెప్పకపోయినా మనసులో అనుకుంటోంది.