యువగళం పాదయాత్రలో నారా లోకేష్ భిన్నమైన పంథాలో వెళ్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికిసెల్ఫీల చాలెంజ్ ను ఎంచుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఘాటుగా విమర్శించడానికి స్పీచ్‌లలో ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో పాదయాత్రలో తనకు ఎదురుపడిన అంశాలు, ప్రజల కష్టాలకు ప్రభుత్వం కారణం ఎలాగో వివరిస్తూ సెల్ఫీలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నారు. ఇవి వైరల్ అవుతున్నాయి.
తాను తీసుకు వచ్చిన పరిశ్రమను చూపించి ఆ పరిశ్రమ ముంతు సెల్ఫీ దిగుతున్న లోకేష్.. జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఒక్క పరిశ్రమ విషయంలో అలా సెల్ఫీ తీసుకుని చూపించాలని సవాల్ చేస్తున్నారు, ఇలాంటి సెల్ఫీ చాలెంజ్ లు ప్రతీ రోజూ ఉంటున్నాయి. కానీ ఒక్కదానికి వైసీపీ నుంచి రిప్లయ్ లేదు. కానీ గ్రాఫిక్స్ గ్రామ, వార్డు సచివాలయాల ముందు లోకేష్ సెల్ఫీ దిగినట్లుగా మార్ఫింగ్ చేసి పెడుతున్నారు. దీంతో టీడీపీ సోషల్ మీడియా నేతలు ట్రోలింగ్ చేస్తున్నారు.
పాదయాత్రలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తూండటంతో ఇలాంటిసెల్ఫీ చాలెంజ్‌లకు కొదవ ఉండటం లేదు. కనీస సౌకర్యాలు అందించలేకపోతున్న ప్రభుత్వం బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోంది. అలాంటివి ఎన్నో బయట పెట్టారు. ఫిష్ ఆంధ్రా పేరుతో చేసిన నిర్వాకాన్నీ వెల్లడించారు. ఇలా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు తాము సాధించిన విజయాలను కూడా… హైలెట్ చేస్తూ సెల్ఫీ చాలెంజ్‌లను లోకేష్ కంటిన్యూ చేస్తున్నారు.
ఈ సెల్ఫీ చాలెంజ్ కు సమాధానం వైసీపీ దగ్గర లేకుండా పోతోంది. ఫేక్ పోస్టులతో సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తూ ట్రోలింగ్ కు గురవుతున్నారు. మొత్తంగా లోకేష్ సెల్ఫీ చాలెంజ్‌లతో వైసీపీ పూర్తి స్థాయిలో కార్నర్ అవుతోంది.