ఫీజురీఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తున్నట్లుగా సొంత పత్రికలో ప్రకటనలు ఇచ్చి వందల కోట్లు సాక్షిఖాతాకు మళ్లించుకున్న జగన్… అసలు ఫీజులు మాత్రం జమ చేయలేదు. ఆ బాకీలు మూడున్నర వేల కోట్లు ఉన్నాయి. ఈ కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వారి సమస్యలను తీర్చేందుకు నారా లోకేష్ సిద్ధమయ్యారు. విద్యార్థులు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని జగన్ రెడ్డి చేసిన మోసాన్ని అందరికీ చూపించి మరీ .. పరిష్కారం చూపిస్తానని అంటున్నారు.
ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం నిధుల సమీకరణ చేస్తోంది. ఈ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడంతో త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఫీజు రీఎంబర్స్ మెంట్, హాస్టల్ ఫీజులను ఎప్పటికప్పుడు పెండింగ్ పెడుతూ పోయారు జగన్. కాలేజీల ఖాతా నుంచి తీసేసి.. విద్యార్థుల తల్లి ఖాతాల్లో వేయడంతో ఎక్కువగా దుర్వినియోగం అయ్యాయి. ఫలితంగా విద్యార్థులకు విద్యా సంవత్సరం ముగిసినా సర్టిఫికెట్లు రాని పరిస్థితి ఏర్పడింది.
విద్యార్థుల సమస్యలు పెరిగిపోవడంతో ఈ సమస్యను పరిష్కరించాలని నారా లోకేష్ నిర్ణయించారు. అయితే జగన్ చేసిన మోసాన్ని మాత్రం ప్రజల ముందు పెట్టాలని డిసైడయ్యారు. ఆ నిధులు ఇస్తున్నందుకు ఎంత ప్రకటనలు ఇచ్చారు.. వాటికి ఎలా చెల్లింపులు చేశారు.. బటన్లు నొక్కిన సభల్లో ఏం చెప్పారు.. ఇదంతా ప్రజడల ముందు పెట్టనున్నారు. జగన్ రెడ్డి తీరును ఎండగట్టనున్నారు.