కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి చంద్రబాబు గారు అడ్వాంటేజ్ అని నారా లోకేష్ చెప్పారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కాంక్లేవ్ లో మంత్రి పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన పాదయాత్రలో వచ్చిందని తెలిపారు. బర్నింగ్ ఇష్యూపై రాజ్ దీప్ లోకేష్ పలుప్రశ్నలు అడిగారు.
త్రిభాషా విధానంతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదని స్పష్టం చేశారు. ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నాం. స్థానిక భాష తెలుగు. మాతృభాషల బలోపేతానికి ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోంది. హిందీని బలవంతంగా రుద్దుతారని భావించడం లేదన్నారు. వైసీపీ హయాంలో తనపై 23 కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు కూడా పెట్టారన్నారు. వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అప్పట్లో బయటకు విపక్షాలను రానివ్వలేదని ఇప్పుడు జగన్ రెడ్డి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్తున్నారు. నేడు డిప్యూటీ సీఎం కంటే జగన్ కు భద్రత ఎక్కువని గుర్తుచేశారు.
1990ల్లో అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరిగేవి. నేడు అలాంటి చర్చలు లేకపోవడం బాధాకరం. జగన్ రెడ్డి వైసీపీకి నాయకుడు. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం సభ సంఖ్యాబలంలో పదిశాతం ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేం. మేం చట్టాలను గౌరవిస్తాం. పార్లమెంట్, శాసనసభలో ఉండే నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తామని లోకేష్ ప్రశఅనించారు. 1985 నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందని మంగళగిరి నుంచి పోటీచేసి 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశాను. 2024 ఎన్నికల్లో పోరాడి 91వేల భారీ మెజార్టీతో గెలిచాను. ఏపీలో ఇది మూడో అత్యధిక మెజార్టీ. కష్టమైన హెచ్ ఆర్డీ శాఖను ఎంచుకున్నానన్నారు. తన భార్య బ్రాహ్మణి తన క్రెడిట్ కార్డు బిల్లు పే చేస్తుందని, మహిళా దినోత్సవం ఒక్క రోజు మాత్రమే కాదు …ప్రతిరోజూ జరుపుకోవాలని అన్నారు.