మంత్రి లోకేష్ ఐదు రోజుల పాటు జర్మనీకి సీక్రెట్ టూర్ కు వెళ్లారంటూ.. వైసీపీ హడావుడి ప్రారంభించింది. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు ప్రారంభం వరకు నాలుగైదు రోజుల పాటు లోకేష్ జర్మనీ టూర్ కి వెళ్లారు. ఆ విషయం టీడీపీలో అందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉన్న వారికీ తెలుసు. అయితే కొత్తగా ఏదో కనిపెట్టినట్లుగా వైసీపీ సోషల్ మీడియా లోకేష్ జర్మనీ సీక్రెట్ గా ఎందుకు వెళ్లారని ప్రశ్నించడం ప్రారంభించింది.
జగన్ పర్మిషన్ తీసుకుని వెళ్లాలా లేకపోతే జగన్ లాగా కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాలా అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. లోకేష్ రాష్ట్ర మంత్రిగా ఉన్నందున విదేశీ పర్యటనకు వెళ్లాలంటే.. వ్యక్తిగత పర్యటనకు అయినా సరే కేంద్రం పర్మిషన్ తీసుకోవాలి. ఆ మేరకు తీసుకున్నారు కూడా. తన సొంత ఖర్చుతో.. సొంత పనులపై వెళ్లినట్లుగా కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఆ అనుమతి పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైసీపీ లోకేష్ విదేశాలకు వెళ్లడం తప్పన్నట్లుగా చేస్తున్న ప్రచారంపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. జగన్ బెంగళూరుకు వెళ్లినట్లుగా వెళ్లి అక్కడ్నుంచి రెండు రోజుల పాటు సీక్రెట్ గా కోల్ కతా టూర్ కు వెళ్లారు. అక్కడ కూడా ఓ ప్రైవేటుహోటల్లో బస చేశారు. అసలు అక్కడ జగన్ జరిపిన సీక్రెట్ మీటింగ్స్ ఏమిటో చెప్పాలని టీడీపీ ప్రశ్నలు సంధించింది. జగన్ వ్యవహారాల్లో కోల్ కతా తరచూ ప్రస్తావనకు వస్తుంది. అయన అక్కడేం చేశారో చెప్పాలని ఇప్పుడు టీడీపీ గట్టిగానే ఎదురుదాడి చేస్తోంది