వైసీపీ వ్యూహకర్తలు.. జగన్ మోహన్ రెడ్డి పరువును ఆన్ లైన్ లో వేలానికి పెట్టేస్తున్నారు. కానీ ఎలా సాధ్యమని ఆలోచించకుండా లక్షలకు లక్షలు వచ్చేస్తున్నారని ప్రచారం చేయడం.. తర్వాత గ్రాఫిక్స్ తో వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేయడం కామెడీగా మారింది. మొదటి మూడు సభల్లో ఎలాగోలా కవర్ చేసుకున్నా.. అద్దంకి సభ దగ్గరకు వచ్చే సరికి మొత్తం దొరికిపోయారు. ఆ సభ ఎలా జరిగింది.. ఆ సభలో జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్పారన్నది కాకుండా.. అసలు ఆ సభను నిర్వహించిన విధానం.. వీఎఫ్ఎక్స్ తో జనాల్ని చూపిస్తున్న వైనమే వైరల్ అవుతోంది.
పదిహేను లక్షల మంది యాభై, వంద ఎకరాల్లో పడతారా ?. పదిహేను లక్షల మంది అంటే… బాపట్ల పార్లమెంట్ నియోజవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య. అంత మంది రావడం జరిగే పనేనా. అంత మంది ఒకే చోట వస్తే ఎలా ఉంటుందో తెలుసా ?. కుంభమేళాలో ఒక్కో సారి రోజుకు పది లక్షల మంది పాల్గొంటారని చెబుతారు. దానికే కాశీ మొత్తం జన సంద్రం అవుతుంది. మరి పదిహేను ల క్షల మంది వస్తే అద్దంకి ఏమైపోవాలి ?. . అతి కష్టం మీద తరలించుకుకు వచ్చింది లక్షా.. లక్షన్నర మంది .. వారినే గ్రాఫిక్స్ లో అటూ ఇటీ తిప్పి ఒకటిన్నర మిలియన్లు అని చెప్పి ట్వీట్లు వేయించుకున్నట్లుగా మారింది.
ఈ జనాల వెనుక ఉన్న గ్రాఫిక్స్ ను .. నారా లోకేష్ బయట పెట్టారు. ఒక్క చోట వచ్చిన గుంపునే గ్రౌండ్ మొత్తం చూపించేందుకు చేసిన హైబడ్దెట్ ఏర్పాట్లును పూసగుచ్చినట్లుగా వివరించారు. అందరికీ అర్థమయ్యేలా మార్ఫింగ్ ఫోటోలనూ పోస్టు చేశారు. లోకేష్ ట్వీట్ ఒక్క సారిగా వైరల్ గా మారింది. గ్రీన్ మ్యాట్లు ఎందుకు పెట్టారో అప్పటికే విస్తృత ప్రచారం జరిగింది. జనం వచ్చారని.. తాము చెప్పేది నమ్మేవాళ్లు ఉన్నారన్న నమ్మకంతో.. వైసీపీ చేసిన ప్రయత్నం పరువు తీసినట్లయింది.
జనాలు లేరని సభలో యాంకర్ అరిచినప్పుడు.. ఐ ప్యాక్ డ్రోన్ పైనే అంబటి రాంబాబు కేకలేసినప్పుడే తేలిపోయింది. పరిస్థితి ముందే గమనించారేమో కానీ.. ఇతర మీడియాలను రానివ్వలేదు. వేరే కెమెరాలను ఆన్ చేయనివ్వలేదు. మొత్తంగా సిద్ధం సభతో వచ్చిన మైలేజీ కన్నా పోయిన పరువే ఎక్కువగా ఉంది వైసీపీకి.