సార్వత్రిక ఎన్నికల్లో బాగంగా ఏపీలో జరిగిన జమిలీ ఎన్నికల్లో బయటపడుతున్న విచిత్రాలు అన్నీ ఇన్నీ కావు. మామూలుగా… ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎన్నికలు జరిగితే… సమస్య రాదు. కానీ.. ఏపీలో మాత్రం.. రెండూ ఒక్కసారే వచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేసిన వాళ్లు.. అదే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి ఓటేయాలని లేదు. అంత వరకు ఓకే కానీ.. అసలు పేరు గొప్ప లీడర్లుగా ప్రచారం పొందిన వారి.. డొల్లతనం..ఓట్లలో బయటపడింది.
జనసేన అధినేత కన్నా… వీవీ లక్ష్మినారాయణనే పాపులర్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేసుకున్నారు. రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. అందులో గాజువాక ఒకటి. భీమవరం సంగతేమో కానీ… గాజువాకలో మాత్రం.. పవన్ కల్యాణ్ గెలుస్తాడని.. అందరూ అనుకున్నారు. పవన్ కల్యాణ్ గాజువాకలో పోటీ చేయడం వల్ల… సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణకు..ఎంతో ప్లస్ అవుతుందని.. ఆయనకు.. గాజువాకలో రికార్డు స్థాయి మెజార్టీ వచ్చి.. ఎంపీగా గెలుస్తారని.. విశ్లేషించారు. కానీ వాస్తవం మాత్రం వేరేగా ఉంది. పవన్ కల్యాణ్..ను మించి… వీవీ లక్ష్మినారాయణ గాజువాకలో పలుకుబడి సాధించారు. ఎంతగా అంటే.. ఇద్దరి మధ్య 14.6 శాతం ఓట్ల తేడా ఉంది. అంటే.. పవన్ కన్నా.. వీవీ లక్ష్మినారాయణకు.. 14.6 శాతం ఓట్లు వచ్చాయి. గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్లో పవన్‌కు 58,539 ఓట్లు రాగా.. వీవీ లక్ష్మినారాయణకు 68, 567 ఓట్లు వచ్చాయి. అంటే.. వీవీ లక్ష్మినారాయణ కోసం.. జనసేనకు ఓట్లు వేసిన వారందరూ… పవన్ కల్యాణ్‌కు వేయలేదు.
మంగళగిరిలో లోకేష్ పరిస్థితీ అదే..!
ఇక ముఖ్యమంత్రి తనయుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన.. నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. మంగళగిరి.. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ ఉన్నారు. లోకేష్ మంగళగిరిలో పోటీ చేయడం వల్ల.. తనకు ఎంతో ప్లస్ అవుతుందని.. ఆయన చాలా సార్లు ప్రచారసభల్లో చెప్పారు. కానీ… ఎంతో కొంత గల్లా జయదేవ్ వల్లనే.. నారా లోకేష్‌కు కాస్త పరువు నిలబడిందని… వచ్చిన ఓట్ల ద్వారా తేలిపోతోంది. మంగళగిరిలో.. నారా లోకేష్‌కు… లక్షా మూడు వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ.. ఆయన నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ… గల్లా జయదేవ్‌కు… మంగళగిరి నియోజకవర్గంలో.. వచ్చిన ఓట్లు… లక్షా పదివేలకుపైగానే. దాదాపుగా 7,100 ఓట్లు గల్లా జయదేవ్‌కు ఎక్కువగా వచ్చాయి. అంటే.. గల్లాకు ఓటేసినవారంతా… లోకేష్‌కు ఓటేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండేవారు. కానీ.. అలా చేయలేదు. వాళ్లు వేరే ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఫలితంగా లోకేష్ పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది.
వారసత్వం కాదు.. నాయకత్వమే చూస్తున్నారు..!
పవన్ కల్యాణ్, లోకేష్‌లకు… ఎన్నికల బరిలో జరిగిన అవమానం చూస్తే.. ప్రజలు.. తమ ప్రతినిధులుగా ఎవర్ని ఎన్నుకోవాలన్న విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. వీవీ లక్ష్మినారాయణ.. నిజాయితీపరుడైన అధికారిగా… ప్రజల్లో గుర్తింపు పొందారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఆయన నిజాయతీ పరుడైన అధికారి కాబట్టి..అందరూ ఓటేయాలని లేదు. ఎవరి ఓటింగ్ ప్రయారిటీలు వారికి ఉంటాయి. అయితే.. ఎక్కువ మంది ప్రజలు.. నాయకుడ్ని చూస్తారని.. ఓటింగ్ ద్వారా స్పష్టమయింది. జనసేన తరపున బరిలో నిలబడిన పవన్ కల్యాణ్… కన్నా… మాజీ జేడీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని ఓటింగ్‌తో తేలింది. అదే సమయంలో.. మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ.. పార్లమెంట్లో గళమెత్తిన గల్లాకు.. లోకేష్ కన్నా ఎక్కువ నాయకత్వ సామర్థ్యం ఉందని నమ్మారు కాబట్టే… మెజార్టీ కట్టబెట్టారు. ఈ విషయంలో… ఆ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలేమో..?