లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాసేపటి క్రితం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ జరుగుతోంది.
తెలంగాణలోని మొత్తం 17, ఏపీలోని 25 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో 13, బీహార్-5, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఒడిశా-4, పశ్చిమబెంగాల్-8, జమ్ముకశ్మీర్లో ఒక్క స్థానం చొప్పున సోమవారం పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే, ఏపీలోని 175, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా, తెలంగాణలో మాత్రం ఎండల వేడిమి నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించినట్లు స్పష్టం చేసింది ఎన్నికల సంఘం.
నాలుగో విడతలో ఐదుగురు కేంద్రమంత్రులతోపాటు పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉండగా, యూపీ నుంచి అజయ్ మిశ్రా, ఉజియాపూర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, జార్ఖండ్ లోని ఖుంటి నుంచి అర్జున్ ముండా, యూపీ నుంచి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత అదిర్ రంజన్ చౌదరిలు పోటీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లోక్ సభకు వైఎస్ షర్మిల కడప నుంచి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.
నాలుగో దశలో పోటీ చేస్తోన్న 476 అభ్యర్తులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ స్పష్టం చేసింది. 24మంది అభ్యర్థులు మాత్రం తమకు అస్తులేమి లేవని తన నివేదికలో వెల్లడించింది.