ఏపీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు లోక్సత్తా జేపీ మద్దతు ప్రకటించారు. ఏ ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. అరాచకపాలనకు చరమగీతం పాడి.. అభివృద్ధి , సంక్షేమానికి పాటు పడేవారికి మద్దతిస్తున్నానని తెలిపారు. ఇలా మద్దతు ప్రకటించినందుకు తనపైనా కులం ముద్ర వేసి తిట్టే వాళ్లు ఉంటారు అయినా నిజాయితీ రాష్ట్ర భవిష్యత్ కోసమే మద్దతు ప్రకటిస్తున్నానన్నారు.
లోక్సత్తా జేపీ కొంత కాలంగా బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఇటీవల ఓ కార్యక్రమంలో జగన్ తో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. దీన్ని అప్పుడే ఖండించారు. కార్యక్రమంలో పాల్గొన్నాను తప్ప రాజకీయాలపై చర్చించలేదన్నారు. తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో యూట్యూబ్ ఇంటర్యూల్లో జగన్ పై పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారంతో ఆయన తీరు తేడాగా ఉందనుకున్నారు.
అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడమే కాకుండా.. రాక్షస పాలనను అంతం చేయాలని పిలుపునిస్తున్నారు. ఇది అనూహ్యమైన మార్పుగానే కనిపిస్తోంది. లోక్ సత్తాకు.. కొంత ఫ్యాన్ బేస్ ఉంది. రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినా.. 1999 ఎన్నికల్లో చదువుకున్న వాళ్ల ఓట్లను చీల్చి.. టీడీపీని దెబ్బకొట్టడంలో తనదైన పాత్ర పోషించారు. ఇప్పడు టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించారు.