సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు పట్టుకోవడం..ఇంటూరి రవికిరణ్ వంటి వాళ్లు ఇచ్చిన వాంగ్మూలాల్లో సజ్జల భార్గవరెడ్డి డబ్బులు ఇచ్చేవారని అందుకే ఆ పోస్టులు పెట్టామని చెప్పారు. అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా ఓ పెద్ద మాఫియా నెట్వర్క్ తరహాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు .
నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు పార్టీలో లేరు. ఆయన బర్మాలో వ్యాపారం చేసుకుటున్నారని చెబుతారు. అయితే వైసీపీ గెలిచిన తర్వాత కుమారుడ్ని సోషల్ మీడియా ఇంచార్జ్ గా చేయడంతో పాటు పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రభుత్వ ఖాతాల నుంచి డబ్బులు చెల్లించారు. ప్రభుత్వం ఓడిపోగానే అన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో సజ్జల భార్గవ రెడ్డి సైలెంట్ అయిపోయారు. అసలు కనిపించడం లేదు.
దీంతో ఆయనను మొదట్లోనే విదేశాలకు పంపించేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఆయన ఇండియాలో లేరని లుకౌట్ నోటీసులు జారీ చేస్తే.. ఏదైనా ఎయిర్ పోర్టులో దిగినప్పుడే తెలుస్తుందని అంటున్నారు. అయితే పోలీసులు ఆయన ఎక్కడెక్కడ ఉంటారన్నదానిపై సమాచారం సేకరించి సోదాలు జరుపుతున్నారు. దొరికితే అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.