పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో పడిందని అంచనాలు వస్తున్న సమయంలో కూడా కేసీఆర్ అంతకు మంచిన వ్యాఖ్యలు చేస్తూండటంతో లాఫింగ్ స్టాక్ గా సీన్ మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రజల్ని ఎక్కువ లోక్ సభ సీట్లు అడగడంతో తప్పు లేదు ..కానీ దానితో తను దేశంలో చక్రం తిప్పుతానని.. ప్రధానమంత్రి అవుతానన్నట్లుగా చెబుతూండటమే రాజకీయ వర్గాలను నవ్వుకునేలా చేస్తోంది.
పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా రాజకీయం చేయడం రాజకీయ నేతల లక్షణం. కానీ అధికారంలో ఉన్న వారు తాము అందరి కంటే ఎక్కువ అనుకుంటూ ఉంటారు. అదే పతనానికి కారణం అవుతూ ఉంటుంది. ఓడిపోయిన తర్వాత కూడా దాన్ని దింపుకోలేనివారు మళ్లీ కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ మాటలు చూస్తూంటే.. తాను ఎంత మాత్రం తగ్గేది లేదన్న భావనలో ఉన్నారని.. ఈ అహంకారాన్ని ప్రజలు అసలు అంగీకరించబోరన్న అభిప్రాయం బలంగా వినిపించడం ప్రారంభమయింది.
ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా ఉంటే.. దేశ రాజకీయాల గురించి మాట్లాడే్స్తున్నారు. దేశ ప్రజలంతా తన వెంటే ఉన్నట్లుగా తనకు వస్తాయని భావిస్తున్న ఒకటి, రెండు సీట్లతోనే ఏదో అయిపోతుందని అనుకుంటున్నారు. పొరుగు రాష్ట్ర రాజకీయాలపై సమాచారం ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. అలాంటి సమాచారాలతో కేసీఆర్ ఈ స్థాయికి పడిపోయారు. ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయంతో నాన్ సీరియస్ పొలిటీషియన్ గా మారిపోతున్నారు. జూన్ నాలుగో తేదీ తర్వాత ఆయన మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. ఇదే రాజకీయం చేస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ కూడా ప్చ్ అనుకోవాల్సి వస్తుందేమో..