ఏపీలో ప్రైవేటు వ్యక్తలు మద్యం దుకాణాలు నిర్వహించునేందుకు లాటరీ పద్దతిని ప్రవేశ పెట్టారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి లాటరీ వస్తే వారికి దుకాణం కేటాయిస్తాయి. తొమ్మిదో తేదీ వరకూ దరఖాస్తులు ఇవ్వ౧చ్చు. 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాప్‌లకు లాటరీలు నిర్వహించి షాపులు కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులు కేటాయిస్తున్నారు. ప్రీమియం మాల్స్ , గీత కులస్తులకు త్వరలో ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
మద్యం దుకాణం కోసం ముందు రెండు లక్షలతో అప్లికేకేషన్ కొనాలి. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. అంటే దుకాణం వచ్చినా రాకపోయినా ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇక జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకూ ఖరారు చేశారు. వేలం పాట పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది కానీ.. దాని వల్ల సమస్యలు వస్తాయని లాటరీ పద్దతినే ఎంచుకున్నారు. వేలం పాట పెట్టి ఎక్కువ లైసెన్స్ ఫీజు కడితే వారు ఎమ్మార్పీ కూడా ఎక్కువకే అమ్ముతారు.
జే బ్రాండ్స్ మొత్తాన్నినిషేధిస్తారు. అలాగే ప్రతి దుకాణంపై నిఘా ఉంటుంది. పేరొందిన బ్రాండ్స్ అన్నింటినీ అందుబాటు లోకి తెస్తారు. 11వ తేదన దుకాణాల కేటాయింపు తర్వాత 12 నుంచే దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానిక ిఅవకాశం కల్పిస్తారు. అంతకు ముందు ఇదే విధానం ఉండేది. తెలంగాణలో ఇదే కొనసాగుతోంది. జగన్ రెడ్డి సీఎం అయ్యాక.. సొంత బ్రాండ్లు అమ్ముకోవడానికి మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తెచ్చారు.