గోపిచంద్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ లౌఖ్యం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో గొపి ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ సాధించడంతో బాలయ్యతో ఛాన్స్ పట్టేశాడు శ్రీవాస్. ఇక నందమూరి హీరోని డిక్టేటర్ గా తెరకెక్కించి పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి గోపిచంద్ శ్రీవాస్ ఓ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.
ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. ఈరోస్ ఇంటర్నేషన్స్ తో పాటుగా శ్రీవాస్ కూడా తన వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ కాంబినేషన్ లో లౌఖ్యం లాంటి హిట్ ఇస్తారా లేక అంతకంటే భారీ హిట్ అందుకుంటారో చూడాలి. ప్రస్తుతం గోపిచంద్ ఏ.ఎం.రత్నం నిర్మాణ సారధ్యంలో ‘ఆక్సీజన్’ సినిమా చేస్తున్నాడు. జ్యోతి కృష్ణ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం జరుగుతుంది.