ఒక సినిమా.. 42 ముద్దులు

తెలుగు సినిమా అన్ని ర‌కాలుగానూ ఎదిగింది. టెక్నిక‌ల్ గా, బ‌డ్జెట్ల ప‌రంగా, వ‌సూళ్ల ప‌రంగా.. ఇప్పుడు ముద్దుల కోటాలోనూ ముందుంది. ఇది వ‌ర‌కు తెలుగు సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చాలా అరుదుగా క‌నిపించేవి. ‘అర్జున్ రెడ్డి’ త‌ర‌వాత లిప్ లాక్ లేని సినిమా లేకుండా పోయింది. ఇప్పుడు ఒక్కో సినిమాలోనూ ఎన్నేసి ముద్దులు ఉన్నాయ‌న్న‌దే కౌంటు. న‌వ‌దీప్ కొత్త సినిమా ‘ల‌వ్ మౌళి’లో ఏకంగా 42 ముద్దు సీన్లు ఉన్నాయ‌ట‌. సినిమా అంటే మ‌హా అయితే 60 స‌న్నివేశాలుంటాయి. అంటే.. ప్ర‌తీ సీన్‌లోనూ దాదాపుగా ఓ ముద్దు కామ‌న్ అన్న‌మాట‌. అంతే కాదు, ఈ సినిమాని బోల్డ్ సీన్లు నింపేశార్ట‌. ఓ శృంగార స‌న్నివేశం దాదాపుగా 4 నిమిషాల పాటు నిర‌వ‌ధికంగా సాగుతుంద‌ని తెలుస్తోంది. ‘ల‌వ్ మౌళి’ టీమ్… యూత్ ని బాగానే టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

చాలా రోజుల త‌ర‌వాత న‌వ‌దీప్ సోలో హీరోగా చేసిన సినిమా ఇది. గెట‌ప్ వెరైటీగా ఉంది. టీజ‌ర్‌లోనే సెగ‌లు పుట్టేంచేశారు. ఈనెల 7న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే కొన్ని ఏరియాల్లో ప్రీమియ‌ర్ షోలు మొద‌లెట్టారు. ఈరోజు విశాఖ‌ప‌ట్నంలో స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షో ఉంది. అక్క‌డ టికెట్ల‌న్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. హైద‌రాబాద్ లో కూడా త్వ‌ర‌లోనే ప్రీమియ‌ర్ షో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈనెల 7న బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాంపిటీష‌న్ ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. ఆ పోటీ త‌ట్టుకోవాలంటే ఈ మాత్రం హ‌డావుడి ఉండాల్సిందేనేమో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close