చాలాకాలం తరవాత… బాక్సాఫీసు దగ్గర కాస్త హంగామా కనిపిస్తోంది.. లవ్ స్టోరీ వల్ల. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా ఇది. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించారు. శేఖర్ పై ఉన్న నమ్మకం…. సాయి పల్లవిపై ఉన్న అభిమానం, అన్నింటికంటే ముఖ్యంగా `సారంగ దరియా`పై ఉన్న ప్రేమ వల్ల… `లవ్ స్టోరీ` అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజులో సాగుతున్నాయి. నిజంగా టాలీవుడ్ కి ఇది శుభ శకునం. తొలి మూడు రోజులూ థియేటర్లు నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలరూ, పాటలూ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే… ఈ సినిమా క్లైమాక్స్ పైనే `లవ్ స్టోరీ` జాతకం ఆధారపడి ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
లవ్ స్టోరీ… కుల,లింగ వివక్షపై శేఖర్ కమ్ముల తీసిన సినిమా. తొలి సగం… హాయిగా సాగిపోయినా, రెండో సగంలో బలమైన ఎమోషన్స్ దట్టించాడట. క్లైమాక్స్ లో శేఖర్ కమ్ముల గట్టి షాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. పరువు హత్య లాంటి ఉదంతం ఈ సినిమా క్లైమాక్స్ లో ఉండబోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓకరంగా లవ్ స్టోరీ సుఖాంతం కాదు. దుఃఖాంతమే. అయితే… తెలుగు ప్రేక్షకులకు సుఖాంతాలే రుచిస్తాయి. నెగిటీవ్ క్లైమాక్స్‌లు భరించడం కష్టం. కానీ… శేఖర్ కమ్ములకి తన కథపై, తన క్లైమాక్స్‌పై బలమైన నమ్మకం. చివరి పది నిమిషాలే కథకు ప్రాణం అని భావిస్తున్నాడు. ఆయా సన్నివేశాలు ప్రేక్షకుల మనసుకు టచ్ అయితే ఈ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని నమ్ముతున్నాడట. ఇప్పుడు ఈ సినిమా భారమంతా క్లైమాక్స్‌పై పడింది. మరి దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.