సరైన హిట్ కోసం చాలా సినిమాల నుంచి వెయిట్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘లవర్’. రిద్ధి కుమార్ హీరోయిన్. ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకుడు. ‘దిల్’ రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలున్నాయి. ఇటీవల పాటల్ని విడుదల చేశారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. ప్రేమకథకు, ప్రేమ సన్నివేశాలను కంపల్సరీ కావాల్సింది మంచి నేపథ్య సంగీతం. టీజర్ స్టార్టింగ్ నుంచి రీరికార్డింగ్ లవ్ సీన్స్‌కి కావలసిన ఫీల్ సెట్ చేసింది. రాజ్ తరుణ్ డైలాగ్ డెలివరీ రెగ్యులర్ స్టైల్లో వుంది. కానీ, సీన్స్ ఫ్రెష్‌గా వున్నాయి. అమ్మాయికి ప్రపోజ్ చేయడం కోసం మరో అమ్మాయి తలలో పువ్వుని తీసుకోవడం, చెప్పాలనుకున్న మేటర్ పేపర్ మీద రాసుకుని అది కాస్తా మర్చిపోయి పేపర్ మళ్ళీ చూడటం ఫన్నీగా వున్నాయి. విజువల్స్‌లో రిచ్‌నెస్ కనిపించింది. ‘నా ప్రేమ విశ్వమంత. నువ్వు తప్పించుకోలేవు’ అనేది హీరో క్యారెక్టరైజేషన్ తెలియజేస్తుంది. ‘కొంచెం ఓవర్ అనిపించడం లేదురా…’ అని హీరో ఫ్రెండ్ అనడం, అందుకు బదులుగా ‘అస్సలు లేదురా’ అని హీరో అనడం బాగుంది.