లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్.. వీటికి మించిన ఫార్ములా లేదు. ఇవన్నీ సమపాళ్లలో మేళవించగలిగితే… యూత్‌ని ఆకట్టుకోవొచ్చు. ‘అలా ఎలా’తో రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పిన అనీష్ కృష్ణ… ఈసారి లవ్, యాక్షన్ డ్రామాని ఎంచుకున్నాడు. అదే.. ‘లవర్’. రాజ్ తరుణ్, రిద్ది కుమార్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. 2 నిమిషాల నిడివి గల ట్రైలర్ ఇప్పుడు బయటకు వచ్చింది. టైటిల్‌ని బట్టి.. ఇది లవ్ స్టోరీ అని ఊహించుకోవొచ్చు. అయితే అందులో రొమాన్స్,యాక్షన్‌ని బాగానే మిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. రాజ్‌తరుణ్ ఓ బైక్ మెకానిక్‌గా కనిపించబోతున్నాడు. రిద్ది కుమార్ మలయాళ నర్సు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? అనేది రొమాంటిక్‌గా చూపిస్తూ… ఈ ప్రేమకథలో వచ్చిన ట్విస్టులూ, టర్న్‌లూ, అమ్మాయి కోసం చేసే ఛేజ్లూ అన్నీ యాక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోయారు. అటు యాక్షన్, ఇటు లవ్ రెండూ కావల్సినంత స్థాయిలోనే ఉన్నాయని అర్థమవుతుంది. డైలాగులు కూడా బాగానే రాసుకున్నాడు. రాజ్‌తరుణ్ హిట్టు కోసం ఆవురావురుమంటున్నాడు. దిల్‌రాజు బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తోందంటే… కచ్చితంగా తప్పు చేయదన్న నమ్మకం. ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది. పైగా అనీష్ కృష్ణకు ‘అలా ఎలా’ అనే ఓ మంచి బ్యాగేజీ ఉంది. ఇవన్నీ కలిసొచ్చేస్తే… ఈ సినిమాతో రాజ్ తరుణ్ పరాజయాల పరంపరకు బ్రేకులు పడిపోవొచ్చు.