జనవరి 1న విడుదలైన నేను శైలజతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టింది మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన నేను శైలజ సినిమాలో శైలజ పాత్ర నిజంగా కీర్తి కోసమే రాశాడా అన్న గుర్తింపు తెచ్చుకుంది. న్యూ ఇయర్ న్యూ హిట్ తో తెలుగులో కొంతకాలంగా హిట్ కోసం తపించిపోతున్న రామ్ కు హిట్ కిక్ ఇచ్చిన కీర్తి సురేష్ అదే ఫాంతో తమిళంలో కూడా మరో హిట్ అందుకుంది.
శివ కార్తికేయ, కీర్తి సురేష్ నటించిన రజిని మురుగన్ సినిమా సంక్రాంతి సందర్భంగా నిన్న రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండు వారాల గ్యాప లో తెలుగులో ఓ హిట్, తమిళ్ లో ఓ హిట్ తన ఖాతాలో వేసుకున్న కీర్తి నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు. మొదటి సినిమానే హిట్ కొట్టిన కీర్తి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఇప్పటికే క్యూలు కడుతున్నారట.
ఇప్పటికే తని ఒరువన్ తెలుగు రీమేక్ లో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కొట్టేసిందని టాక్. మరి అది కూడా హిట్ అయితే రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే. వరుసెంట ఇన్ని లక్కీ చాన్సులు వస్తుస్తున్నది చూస్తుంటే లాక్ అంటే కీర్తి సురేష్ దే అనకుండా ఉండలేం.