ఈవారం రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ‘నా నువ్వే’. రెండోది ‘సమ్మోహనం’. నా నువ్వే గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ‘సమ్మెహనం’లో మాత్రం క్లాస్ ఆడియన్స్‌కి నచ్చే లక్షణాలు కనిపించాయి. అయితే.. రెండింటి కలక్షన్లూ అంతంత మాత్రమే. ఈవారం ‘జంబలకిడి పంబ’ రాబోతోంది. టైటిల్ తోనే జనాల్ని థియేటర్‌కి రప్పించే సత్తా ఉంది. శ్రీనివాస రెడ్డి కామెడీ కూడా జనాలకు నచ్చుతుంది కాబట్టి… ‘హీరోగా ఏం చేశాడో చూద్దాం’ అని థియేటర్‌కి వచ్చేవాళ్లు ఎక్కువే ఉంటారు. పైగా ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటూ.. మంచి కథలనే ఎంచుకుంటున్నాడు శ్రీనివాసరెడ్డి. ఆ నమ్మకం కూడా ఓ ప్లస్ పాయింటే. దానికి తోడు బాక్సాఫీసు మరీ డల్‌గా ఉంది. సరైన సినిమా పడి చాలారోజులైంది. ‘జంబలకిడి పంబ’పై గొప్ప అంచనాలు లేకపోవొచ్చు. కానీ రెండు గంటల పాటు నాన్ స్టాప్‌గా నవ్విస్తే గనుక కాసులు కురిపించుకోవొచ్చు. వినోదం రాబట్టే.. ‘సరుకు’ ఈ కథకు ఉందని ట్రైలర్లలో అర్థమవుతోంది. పైగా… బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ కూడా లేదు. 14న రావాల్సిన సినిమా ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి అన్న ఆశతో కాస్త ఆలస్యంగా వస్తోంది. అది కూడా ఈసినిమాకి కలిసొచ్చేదే. మరి శ్రీనివాసరెడ్డి అదృష్టం ఎలా ఉందో చూడాలి.