లూలూ గ్రూప్ తమిళనాడులో రెండు అత్యంత భారీ మాల్స్ నిర్మించి రూ. మూడున్నర వేలకోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు తమిళనాడులో ఈ మాల్స్ .. పెట్టుబడులు పెట్టాలని లూలూ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. లూలూ గ్రూప్ అంటే తెలియని వారు లేరు. గల్ఫ్‌లో ఉన్న అతి పెద్ద షాపింగ్ మాల్స్‌లో లూలూ గ్రూప్ తనదైన ముద్ర వేసింది. ఇండియాలనూ ఇటీవల విస్తృతంగా పెట్టుబడులు పెడుతోంది. అన్ని రాష్ట్రాలురెడ్ కార్పెట్ వేసి లూలూకు స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ, యూపీలతోనూ లూలూ ఒప్పందం చేసుకుంది.
లూలూ అంటే.. ఆంధ్రులకు కూడా కొన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. చంద్రబాబు హయాంలో అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు సాయంతో చంద్రబాబు లూలూ గ్రూప్‌ను ఏపీకి ఆహ్వానించారు. వారు కూడా విశాఖలోరూ. రెండు వేల కోట్లు పెట్టి మాల్ నిర్మించడానికి సిద్ధమయ్యారు. శంకుస్థాపన కూడా జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. లూలూకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకున్నారు.దీంతో లూలూ గ్రూప్ ఇక సమీప భవిష్యత్‌లో ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని ప్రకటించేసింది. ఇది ఏపీపై పెట్టుబడిదారుల్లో మరింత చులకన భావం ఏర్పడటానికి కారణం అయింది.
అప్పట్నుంచి ఏపీకి ఎలాంటి పెట్టుబడులు మెటీరియలైజ్ అవుతున్న సూచనలు కనిపించడం లేదు.ఇంటిలెజెంట్ సెజ్ అని.. మరొకటి అని ఊరూపేరూ లేని కంపెనీలతో ఒప్పందాు చేసుకుంటూంటారు. అవి ఏమవుతున్నాయో… ఎవరికీ తెలియదు. కానీ ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. వారి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఏపీ యువతకు మాత్రం ఉద్యోగాల గురించి ఆలోచించే తీరిక లేకుండా ప్రాంతీయ, కుల, మత ద్వేషాల రాజకీయాన్ని ఇస్తున్నారు.